Anasuya Bharadwaj: అనసూయ సోషల్ మీడియా అరాచకాలు కొనసాగుతున్నాయి. ఆమె తన హేటర్స్ ని రెచ్చగొడుతూ, ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది. నిరవధికంగా గ్లామరస్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంది. ఆమె తాజా వీడియో కుర్రాళ్ళ గుండెల్లో గునపాలు దించింది. ఫ్రాక్, టాప్ ధరించి కవ్వించింది. హొయలు పోతూ క్రేజీ వీడియో చేసింది. ఇక అనసూయ వీడియో చూసిన నెటిజెన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. కొందరైతే పచ్చి కామెంట్స్ తో ఆమెను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
అనసూయ గ్లామరస్ వీడియో వైరల్ గా మారింది. నటిగా అనసూయ కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. మంచి నటిగా పేరు తెచ్చుకున్న అనసూయకు ప్రయోగాత్మక చిత్రాల్లో పత్రాలు దక్కుతున్నాయి. ఇటీవల ఆమె నటించిన రంగమార్తాండ, విమానం చిత్రాలకు ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ సక్సెస్ పక్కన పెడితే క్రిటిక్స్ కొనియాడారు.
రంగమార్తాండలో మోడ్రన్ భావాలున్న కోడలిగా, విమానం చిత్రంలో స్లమ్ ఏరియాలో బ్రతికే వేశ్యగా విభిన్న పాత్రలు చేసింది. విడుదలకు సిద్ధంగా ఉన్న రంగబలి మూవీలో కూడా అనసూయ బరువైన పాత్ర చేసినట్లు సమాచారం. అనసూయ ఖాతాలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప 2. షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ చిత్రంలో అనసూయ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.
మరోవైపు అనసూయ వివాదాలతో సహజీవనం చేస్తుంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండతో ఆమె కావాలని లొల్లి పెట్టుకున్నారు. విజయ్ దేవరకొండ దగ్గర పని చేసే వ్యక్తి డబ్బులిచ్చి తనను ట్రోల్ చేయిస్తున్నాడని తెలిసిందట. విజయ్ దేవరకొండ ప్రమేయం లేకుండా జరిగే ప్రసక్తి లేదని నమ్మిన అనసూయ ఆయన్ని టార్గెట్ చేసిందట. అయితే ఇకపై ఆ వివాదానికి ఫుల్ స్టాప్ ఆడుతున్నట్లు అనసూయ వెల్లడించింది.