https://oktelugu.com/

Manchu Manoj: అవమానాలు మౌనంగా భరించా… మరో సంచలన వీడియో వదిలిన మంచు మనోజ్!

జయాపజయాలతో సంబంధం లేకుండా మంచు విష్ణు సినిమాలు చేస్తున్నాడు. మనోజ్ అయితే మానేశాడు. 2018 తర్వాత మనోజ్ ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇటీవల కమ్ బ్యాక్ ప్రకటించాడు.

Written By:
  • Shiva
  • , Updated On : September 23, 2023 / 01:48 PM IST

    Manchu Manoj

    Follow us on

    Manchu Manoj: తెలుగు సినిమాపై నటుడు మోహన్ బాబు తనదైన ముద్ర వేశాడు. విలన్ గా కెరీర్ మొదలుపెట్టి స్టార్ హీరో అయ్యాడు. కలెక్షన్ కింగ్ గా అవతరించాడు. పరిశ్రమ పెద్దల్లో ఒకరిగా సామ్రాజ్యం నిర్మించుకున్నాడు. అయితే ఆయన వారసులు దాన్ని కొనసాగించలేకపోయారు. మంచు విష్ణు, మనోజ్ హీరోలుగా ఫెయిల్ అయ్యారు. కనీసం టైర్ టు జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. వాళ్ళ అభివృద్ధికి మోహన్ బాబు ఎంతో కృషి చేశారు, చేస్తున్నారు. కానీ ఫేమ్ రావడం లేదు. మొదట్లో పర్లేదు అనిపించారు. ఇప్పుడు పూర్తిగా చతికిలపడ్డారు.

    జయాపజయాలతో సంబంధం లేకుండా మంచు విష్ణు సినిమాలు చేస్తున్నాడు. మనోజ్ అయితే మానేశాడు. 2018 తర్వాత మనోజ్ ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇటీవల కమ్ బ్యాక్ ప్రకటించాడు. వాట్ ది ఫిష్ టైటిల్ తో మనోజ్ ఒక చిత్రం చేస్తున్నాడు. అలాగే మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నట్లు వెల్లడించారు. అలాగే రెండో వివాహం చేసుకున్నాడు. భూమా మౌనికను మార్చ్ 3న వివాహం చేసుకున్నాడు.

    కాగా మనోజ్ కొత్త అవతారం ఎత్తాడు. ఎవరూ ఊహించని షాక్ ఇచ్చాడు. ఆయన హోస్ట్ గా టాక్ షో మొదలైంది. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. సదరు ప్రోమో మనోజ్ తన సినిమా జర్నీని ఎమోషనల్ గా చెప్పాడు. రాక్ స్టార్ గా ప్రశంసలు అందుకున్న నేను సినిమాకు దూరం కావాల్సి వచ్చింది. ఇక నాపని అయిపోయిందన్నారు. ఆ అవమానాలన్నీ భరించాను. మరలా తిరిగి వస్తున్నానంటూ ప్రోమో వదిలాడు.

    రామోజీరావు ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ లో త్వరలో మనోజ్ హోస్ట్ గా టాక్ షో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో ఆసక్తి రేపుతోంది. ఈ టాక్ షో నిర్మాణంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కూడా భాగస్వామ్యం అయ్యింది. హోస్ట్ అవతారం ఎత్తిన బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోతో టీఆర్పీ రేటింగ్స్ బద్దలు కొట్టాడు. మరి మనోజ్ ఏ మేరకు సక్సెస్ అవుతాడో చూడాలి. మరోవైపు మంచు విష్ణుతో మనోజ్ కి విబేధాలు కొనసాగుతున్నాయి.