BB Jodi 2 grand finale winner: గత కొంతకాలం నుండి స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న ‘BB జోడి 2’ డ్యాన్స్ రియాలిటీ షో మంచి టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. గత వారం తో మెయిన్ ఎపిసోడ్స్ పూర్తి అయ్యాయి. ఈ వారం సెమి ఫైనల్స్ జరగబోతుంది. అయితే నిన్నటితో ఈ షో కి సంబంధించిన గ్రాండ్ ఫినాలే షూటింగ్ ముగిసింది అట. అందరూ ఊహించినట్టుగా మానస్ – శ్రేష్టి వర్మ, అమర్ దీప్ – నైనికా జంటలలో ఎవరో ఒకరు టైటిల్ గెలుస్తారని అనుకున్నారు. ఎందుకంటే మొదటి నుండి ఈ షో లో అద్భుతమైన డ్యాన్స్ కనబరుస్తూ అత్యధిక సార్లు గోల్డెన్ సోఫా ని సంపాదించుకున్నది వీళ్ళు మాత్రమే. అయితే విన్నర్ కూడా వీరిలోనే అయ్యారు. మానస్ – శ్రేష్టి వర్మ టైటిల్ గెలుచుకున్నట్టు తెలుస్తోంది.
అయితే రన్నర్స్ గా కచ్చితంగా అమర్ దీప్ – నైనికా జంట గెలుచుకొని ఉంటుందని మీరంతా అనుకుంటే పెద్ద పొరపాటే. వాళ్లకు బదులుగా విశ్వ – నేహా జంట రన్నర్స్ గా నిలిచారట. ఇది ఇప్పుడు అమర్ దీప్ ఫ్యాన్స్ ని తీవ్రమైన దిగ్బ్రాంతికి గురయ్యేలా చేస్తోంది. ఎందుకంటే ఈ జంట ఒకటి రెండు వారాలు మినహా, ప్రతీ వారం గ్లోదేం సోఫా ని సంపాదించుకుంటూ వచ్చింది. అంత మంది జోడీలను దాటుకొని ఇన్ని సార్లు గోల్డెన్ సోఫాని దక్కించుకోవడం అనేది చిన్న విషయం కాదు. అలాంటి జంట టైటిల్ గెలవకపోయిన, కనీసం రన్నర్స్ గా అయినా మిగులుతారని అభిమానులు భావించారు. కానీ ఆ స్థానం కూడా దక్కలేదు. ప్రతీ ఎపిసోడ్ ని గ్రాండ్ ఫినాలే గా భావించి ఎంతో కసితో డ్యాన్స్ వేసే జంట, గ్రాండ్ ఫినాలే కి ఎందుకు ఇలా వెనకబడింది అనేది ఎవ్వరికీ అంతు చిక్కని ప్రశ్న.
పొరపాటున వీళ్లిద్దరు డ్యాన్స్ వేస్తున్న సమయం లో జారీ పడ్డారా ?, లేదంటే నిజంగానే ఫినాలే కి ఆ రేంజ్ డ్యాన్స్ చెయ్యలేదా అనేది చూడాలి. వచ్చే వారం ప్రోమోలలో కూడా మానస్ – శ్రేష్టి వర్మ డ్యాన్స్ విశ్వరూపం చూపించేసారు. ఆ రేంజ్ ఫార్మ్ లో ఉన్న వాళ్ళని ప్రస్తుతం అందుకోవడం కష్టమే, అందుకే అమర్ దీప్ , నైనికా జంట ఓడిపోయిందని అంటున్నారు. గత సీజన్ లో అమర్ దీప్ తన సతీమణి తేజస్విని తో కలిసి వచ్చి, టైటిల్ ని గెలుచుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అలాంటి అమర్ దీప్ ఇప్పుడు టాప్ 3 స్థానానికి పరిమితం అవ్వడం ఆయన అభిమానులకు బాధ కలిగించేదే. జడ్జీల మార్కుల ద్వారా కాకుండా, ఆడియన్స్ ఓటింగ్ ద్వారా టైటిల్ విన్నర్ ని నిర్ణయించాల్సి వస్తే కచ్చితంగా అమర్ దీప్ – నైనికా జంట టైటిల్ గెలుచుకునేవారని అంటున్నారు నెటిజెన్స్.