Homeఎంటర్టైన్మెంట్Barrelakka Wedding: బర్రెలక్కకు పెళ్లి, ఘనంగా నిశ్చితార్థం... అబ్బాయి ఎవరంటే?

Barrelakka Wedding: బర్రెలక్కకు పెళ్లి, ఘనంగా నిశ్చితార్థం… అబ్బాయి ఎవరంటే?

Barrelakka Wedding: బర్రెలక్క యూట్యూబ్ వీడియోలు చేస్తూ పాపులర్ అయింది. తన అసలు పేరు శిరీష. ఒక పేద కుటుంబానికి చెందిన యువతి. పొలంలో బర్రెలు కాస్తూ వీడియోలు, రీల్స్ చేస్తుండేది. డిగ్రీ చదువుకున్న ఉద్యోగం రాలేదంటూ ఆమె చేసిన వీడియోతో బాగా ఫేమస్ అయింది. సోషల్ మీడియాలో బర్రెలక్క గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచి .. 5,754 ఓట్లు సాధించింది. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఆమె మరింత పాప్యులర్ అయ్యారు. బర్రెలక్క తరపున జేడీ నారాయణ ప్రచారం చేశారు.

అయితే బర్రెలక్క పెళ్ళికి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆమెకు నిశ్చితార్థం జరిగింది. గతంలో పలుమార్లు బర్రెలక్క పెళ్లి పై వార్తలు వచ్చాయి. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ తో బర్రెలక్క పెళ్లి అంటూ రూమర్స్ వినిపించాయి. అందులో ఎంత మాత్రం నిజం లేదని. ప్రశాంత్ తనకు అన్న లాంటి వాడని .. అన్నని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అంటూ శిరీష రూమర్స్ ని కొట్టి పారేసింది.

ఎట్టకేలకు తానే స్వయంగా గుడ్ న్యూస్ చెప్పింది బర్రెలక్క. ఆమెకు పెళ్లి ఫిక్స్ అయినట్లు తెలిపింది. తన ఎంగేజ్మెంట్ ఫోటోలు, అలాగే పెళ్లి కోసం చేసిన షాపింగ్ ఫోటోలు షేర్ చేసింది. సడన్ గా నిశితార్థం ఫిక్స్ కావడం వలన ఎవరిని పిలవలేకపోయానని బర్రెలక్క ఫ్యాన్స్ కి వివరణ ఇచ్చింది. పెళ్లి మ్యాటర్ చెప్పిన ఆమె, కాబోయే భర్త ఎవరు అని రివీల్ చేయలేదు. అయితే ప్రస్తుతం బర్రెలక్క షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

శిరీష పెళ్లి వార్త విని నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక నిశ్చితార్థం పూర్తి కాగా ఆమె పెళ్లిపీటలు ఎక్కనుంది. అయితే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ బర్రెలక్క ధైర్యం కోల్పోలేదు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేస్తాను అంటూ బర్రెలక్క గతంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే…

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version