Bangarraju: ‘బంగార్రాజు’ను పట్టుకున్న బెంగ..!

Bangarraju: నాగార్జున-నాగచైతన్య కాంబోలో తాజాగా వస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. కింగ్ నాగార్జున గత చిత్రం ‘సొగ్గాడే చిన్నినాయనా’కు ‘బంగార్రాజు’ సీక్వెల్ గా రాబోతుంది. ‘సొగ్గాడే చిన్నినాయనా’ మూవీ సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఏపీ సర్కారు నిర్ణయాలు, కరోనా పరిస్థితులు ఈ మూవీ కలెక్షన్లపై భారీగా ప్రభావం చూపే అవకాశం ఉందడటంతో ‘బంగార్రాజు’కు బెంగ పట్టుకుందని తెలుస్తోంది. సంక్రాంతికి రావాల్సిన ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ మూవీలు దేశంలో కరోనా పరిస్థితుల […]

Written By: Sekhar Katiki, Updated On : January 11, 2022 12:03 pm
Follow us on

Bangarraju: నాగార్జున-నాగచైతన్య కాంబోలో తాజాగా వస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. కింగ్ నాగార్జున గత చిత్రం ‘సొగ్గాడే చిన్నినాయనా’కు ‘బంగార్రాజు’ సీక్వెల్ గా రాబోతుంది. ‘సొగ్గాడే చిన్నినాయనా’ మూవీ సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఏపీ సర్కారు నిర్ణయాలు, కరోనా పరిస్థితులు ఈ మూవీ కలెక్షన్లపై భారీగా ప్రభావం చూపే అవకాశం ఉందడటంతో ‘బంగార్రాజు’కు బెంగ పట్టుకుందని తెలుస్తోంది.

Bangarraju

సంక్రాంతికి రావాల్సిన ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ మూవీలు దేశంలో కరోనా పరిస్థితుల కారణంగా రిలీజును వాయిదా వేసుకున్నాయి. ఇవన్నీ కూడా భారీ బడ్జెట్ సినిమాలు కావడంతో వాయిదా తప్పలేదు. ఇక సందేట్లో సడేమియాలాగా చిన్న సినిమాలన్నీ సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నాయి. ఈక్రమంలోనే నాగార్జున నటించిన ‘బంగార్రాజు’ కూడా జనవరి 14న రిలీజుకు రెడీ అయింది.

Also Read:  ప్రభాస్ ‘ప్రాజెక్ట్‌ కే’ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ !

‘ఆర్ఆర్ఆర్’ ప్లేసును భర్తీ చేద్దామనుకున్న నాగార్జునకు ఏపీలోని పరిస్థితులు దెబ్బేసేలా కన్పిస్తున్నాయి. ఏపీలో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. అలాగే 50శాతం అక్సుపెన్సీతో మాత్రమే థియేటర్లను నడపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రభావం సినిమా కలెక్షన్లపై చూపే అవకాశం ఎక్కువగా ఉందని టాక్ విన్పిస్తోంది.

ఏపీలోని సినిమా టికెట్లు తగ్గింపు తన సినిమాకు పెద్దగా ఎఫెక్ట్ కాదని ముందుగానే తేల్చి చెప్పిన నాగార్జునకు 50శాతం అక్సుపెన్సీ మాత్రం మైనస్ గా మారనుంది. అలాగే  నైట్ కర్ఫ్యూ కారణంగా రోజు మూడు షోలు మాత్రమే థియేటర్లు నడిపే అవకాశం ఉంది. దీంతో బంగార్రాజుకు కలెక్షన్ల బెంగ పట్టుకుందని తెలుస్తోంది.

ఇక ‘బంగార్రాజు’ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.39కోట్లు చేసిందని టాక్. నాగార్జున కెరీర్లోనే ఇది హైయ్యస్ట్ బిజినెస్ గా తెలుస్తోంది. అయితే కరోనా పరిస్థితులు మాత్రం ‘బంగ్రారాజు’ వెంటాడేలా కన్పిస్తున్నాయి. దీంతో ఈ సినిమాకు అయిన ఖర్చునైనా వెనక్కి రాబతుందా? అనే చర్చ నడుస్తోంది. కాగా ఈ సినిమాలో 8మంది హీరోయిన్లు నటించారు. రమ్యకృష్ణ, కృతిశెట్టి ప్రధాన హీరోయిన్లు కాగా మిగిలిన ఆరుగురు స్పెషల్ అప్పియరెన్స్ లో కన్పించనున్నారు.

Also Read:  ‘పుష్ప’ కి మరో స్టార్ హీరో ఫిదా.. ఎందుకు అందరూ పుష్ప పై పడ్డారు ?