Bangarraju: రెండోరోజు ‘బంగార్రాజు’ వసూళ్ల మోత..!

Bangarraju Second Day Collections: జనవరి 14న కింగ్ నాగార్జున నటించిన ‘బంగార్రాజు’ థియేటర్లలో విడుదలైంది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ తొలిరోజు నుంచే మంచి వసూళ్లను రాబడుతోంది. నాగార్జున-నాగచైతన్య కాంబోకు అక్కినేని ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతుండంతో వరుసగా రెండోరోజు కూడా వసూళ్ల మోత మోగిపోయింది. దీంతో ఈ సినిమా కేవలం రెండు రోజుల్లో రూ. 36కోట్లు వసూలు చేసిందని చిత్రబృందం తాజాగా పోస్టర్ రిలీజ్ చేయడం ఆసక్తిని రేపుతోంది. సంక్రాంతి రేసులో పెద్ద సినిమాలేవీ […]

Written By: Raghava Rao Gara, Updated On : January 16, 2022 3:26 pm
Follow us on

Bangarraju Second Day Collections: జనవరి 14న కింగ్ నాగార్జున నటించిన ‘బంగార్రాజు’ థియేటర్లలో విడుదలైంది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ తొలిరోజు నుంచే మంచి వసూళ్లను రాబడుతోంది. నాగార్జున-నాగచైతన్య కాంబోకు అక్కినేని ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతుండంతో వరుసగా రెండోరోజు కూడా వసూళ్ల మోత మోగిపోయింది. దీంతో ఈ సినిమా కేవలం రెండు రోజుల్లో రూ. 36కోట్లు వసూలు చేసిందని చిత్రబృందం తాజాగా పోస్టర్ రిలీజ్ చేయడం ఆసక్తిని రేపుతోంది.

సంక్రాంతి రేసులో పెద్ద సినిమాలేవీ లేకపోవడం ‘బంగార్రాజు’కు అడ్వాంటేజ్ గా మారింది. దీనికి తోడు ‘సొగ్గాడే చిన్ని నాయనా’ సినిమాను మించేలా దర్శకుడు కల్యాణ్ కృష్ణ ‘బంగార్రాజు’ను తెరకెక్కించాడు. పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో పండుగ వాతావరణాన్ని తలపించేలా ‘బంగార్రాజు’ మూవీ ఉండటంతో ఈ మూవీకి ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ అట్రాక్ట్ అవుతున్నారు. కరోనాను లెక్క చేయకుండా థియేటర్లకు పరుగులు పెడుతున్నారు.

ఈ సంక్రాంతి సీజన్ ‘బంగార్రాజు’ చాలా బాగా కలిసొచ్చింది. దీంతో వరుసగా మూడోరోజు కూడా థియేటర్లలో కలెక్షన్ల మోత మోగుతోంది. గత రెండురోజుల కలెక్షన్స్ పరిశీలించినట్లయితే .. తొలిరోజు ఈ సినిమాకు నైజంలో రూ. 2.41కోట్లు, సీడెడ్లో 1.66 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.93లక్షలు, ఈస్ట్ లో 88లక్షలు, వెస్ట్ లో 49లక్షలు, గుంటూరులో 61లక్షలు, కృష్ణాలో49లక్షలు, నెల్లూరులో 32లక్షలు గ్రాస్ వచ్చింది.

ఇక రెండో రోజు నైజాంలో రూ. 4.47కోట్లు, సీడెడ్లో 3.46 కోట్లు, ఉత్తరాంధ్రలో 2.20 కోట్లను రాబట్టింది. అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లోనూ ‘బంగార్రాజు’ సాలీడ్ కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఈ మూవీ కేవలం రెండు రోజుల్లోనే రూ. 36 కోట్లు వసూలు చేసిందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించడం విశేషం. విడుదలకు ముందు 39కోట్ల బిజినెస్ చేసిన ‘బంగార్రాజు’ రెండోరోజుల్లోనే బ్రేక్ ఈవెంట్ మార్క్ కు చేరుకోవడంతో చిత్రయూనిట్ ఖుషీ అవుతోంది.