Bangarraju Movie: ఏడాది అక్కినేని కుటుంబం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు ఒక సినిమా తర్వాత ఒకరు తమ సినిమాల గురించి కొత్త అప్డేట్స్ ను అభిమానులకు తెలియజేస్తున్నారు. అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కించిన చిత్రం” సోగ్గాడే చిన్ని నాయన ” 2016లో సంక్రాంతి కానుకగా విడుదలై థియేటర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం “బంగార్రాజు” ఈ చిత్రం గురించి మరో తాజా అప్డేట్ తెలియజేసింది చిత్ర బృందం.

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నాగ చైతన్య కూడా ఒక ముఖ్య పాత్రలో అలరించేందుకు రెడీ అయ్యారు. ఈ అక్కినేని హీరోల సరసన జోడిగా రమ్యకృష్ణ, కృతి శెట్టి నటిస్తున్నారు. ఇప్పటికే సగభాగం షూటింగ్ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది ఈ సినిమా. కాగా ప్రస్తుతం మైసూర్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
అయితే నవంబర్ 23 వ తేదీన అక్కినేని నాగ చైతన్య బర్త్ డే సందర్భంగా అభిమానులకు ఓ స్వీట్ న్యూస్ ఇచ్చింది చిత్ర బృందం. నవంబర్ 22 వ తేదీన సాయంత్రం 5.22 గంటలకు బంగార్రాజు ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తునట్లు మూవీ టీమ్ ప్రకటించారు. అలానే నాగచైతన్య పుట్టిన రోజు నవంబర్ 23 సందర్భంగా ఉదయం 10.23 గంటలకు ఈ సినిమా టీజర్ ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు మేకర్స్. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.
వాసివాడి తస్సాద్దియ్యా !!!💥
బంగార్రాజు సందడి లేకపోతే ఎలాగా🤘🏻😎#Bangarraju’s 𝙁𝙞𝙧𝙨𝙩 𝙡𝙤𝙤𝙠
on 22nd Nov @ 05.22 PM 😍Massy 𝙏𝙚𝙖𝙨𝙚𝙧
on 23rd Nov @ 10.23 AM ⏰ @iamnagarjuna @chay_akkineni @IamKrithiShetty @kalyankrishna_k @anuprubens @Zeemusicsouth @ZeeStudios_ pic.twitter.com/HfON3XrqpF— Annapurna Studios (@AnnapurnaStdios) November 20, 2021