Bangarraju Box Office: అక్కినేని నాగార్జున – నాగచైతన్య కలయికలో వచ్చిన ‘బంగార్రాజు’ భారీ అంచనాల మధ్య వచ్చి మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబట్టలేక పోయినా ఓ కోణంలో మంచి కలెక్షన్స్ నే రాబడుతున్నాడు. ఐతే, ఈ సినిమా రిలీజ్ అయి 18 రోజులు అవుతున్నా ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. మొత్తమ్మీద కలెక్షన్స్ విషయంలో ‘బంగార్రాజు’ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. మరి ఈ సినిమా లేటెస్ట్ కలేక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

ఈ చిత్రం 18 రోజుల కలెక్షన్ల వివరాలను ఒకసారి గమనిస్తే :
గుంటూరు 3.54 కోట్లు
కృష్ణా 2.24 కోట్లు
నెల్లూరు 1.89 కోట్లు
నైజాం 8.36 కోట్లు
సీడెడ్ 7.52 కోట్లు
ఉత్తరాంధ్ర 5.05 కోట్లు
ఈస్ట్ 4.07 కోట్లు
వెస్ట్ 2.90 కోట్లు
ఇక ఏపీ మరియు తెలంగాణ మొత్తం కలుపుకుని చూస్తే : 35.57 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 3.25 కోట్లు
ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా 38.82 కోట్లును ఈ చిత్రం రాబట్టింది.
Also Read: టాలీవుడ్ ప్రజెంట్ క్రేజీ మూవీ అప్ డేట్స్ !
‘బంగార్రాజు’ సినిమాకు రూ.38.31 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని లెక్కలు చెబుతున్నాయి. అంటే.. ఈ సినిమా బయర్లకు బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.39 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. కాగా 18 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ. 38.82 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక బ్రేక్ ఈవెన్ కు మరో రూ. 0.18 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే, ఇక ఈ సినిమాకు కలెక్షన్స్ వచ్చే పరిస్థితి లేదు. ఆంధ్రాలో తప్ప నైజాం, ఓవర్సీస్ వంటి ఏరియాల్లో ఈ మూవీ నష్టాలను అందించింది.

మొదటి నుంచి నైజాంలో మాత్రం ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రావడం లేదు. మొత్తమ్మీద ‘బంగార్రాజు’ ఏవరేజ్ రేంజ్ లో కలెక్షన్స్ ను రాబట్టినా బ్రేక్ ఈవెన్ కాలేక చేతులు ఎత్తేశాడు. మొత్తమ్మీద ‘బంగార్రాజు’ ఏపీలో గట్టెక్కాడు, నైజాంలో బోర్లా పడ్డాడు.
Also Read: కూతురి విడాకుల పై రజినీకాంత్ స్పందన !
[…] […]
[…] […]