Bandla Ganesh- Pawan kalyan: బండ్ల గణేష్ ట్వీట్స్ కొన్ని ద్వందార్ధాలు కలిగి ఉంటాయి. చాలా విషయాల్లో నేరుగా స్పందించే బండ్ల గణేష్ అప్పుడప్పుడు పరోక్షంగా ఎవరినో టార్గెట్ చేసినట్లు అనిపిస్తుంది. కాగా తాజాగా ఆయన వేసిన ఒక ట్వీట్ బండ్ల అమితంగా అభిమానించే పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించే చేశారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. మీడియా సంస్థలు దీనిపై కథనాలు ప్రచురించాయి. పవన్ కళ్యాణ్ దర్శకుడు సుజీత్ తో కొత్త మూవీ ప్రకటన చేశారు. డివివి దానయ్య నిర్మాతగా ఈ భారీ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వచ్చింది. కాన్సెప్ట్ పోస్టర్ కూడా విడుదల చేశారు.

కాన్సెప్ట్ పోస్టర్ భారీగా వైరల్ అయ్యింది. దర్శకుడు కథ గురించి హింట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా చేస్తున్నారు. ఇది జపాన్, ముంబై నేపద్యంలో ప్రధానంగా సాగే చిత్రం అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే సుజీత్-పవన్ మూవీ ప్రకటన అనంతరం బండ్ల గణేష్ ఒక ట్వీట్ చేశారు. ‘వరాలు ఇచ్చే గుడికి వెళ్దాం , దాంతోపాటు ప్రసాదం కూడా తిందాం, లేకపోతే టైం వేస్ట్.. టైం ఎక్కువ లేదు.. మన ఫ్యామిలీకి ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వాలి’ అని ట్విట్టర్ లో కామెంట్ పోస్ట్ చేశారు. పవన్ కొత్త మూవీ ప్రకటనకు లింక్ చేస్తూ బండ్ల గణేష్ ఎక్కడ టార్గెట్ చేసింది ఆయన్నే అంటూ పుకార్లు మొదలయ్యాయి.
చాలా కాలంగా బండ్ల గణేష్ నిర్మాతగా తనకు ఒక ఛాన్స్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ని కోరుతున్నారు. సోషల్ మీడియా వేదికగా అభ్యర్థనలు చేస్తున్నారు. ఈ క్రమంలో బండ్ల గణేష్ కి కాకుండా మరో నిర్మాతకు పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇచ్చారనే కోపంతో బండ్ల ఇలాంటి ట్వీట్ చేశారంటూ వార్తలు వచ్చాయి. దీనిపై బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చారు. ‘జీవితంలో పవన్ కళ్యాణ్ మీద హర్ట్ కావడం అనేది జరగదు. నా బాస్ ని ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటా’ అని మరో ట్వీట్ వేశారు. దీంతో పుకార్లకు ఆయన తెరదించారు.

పవన్ కళ్యాణ్ ని బండ్ల గణేష్ భక్తుడిగా ఆరాధిస్తారు. ఏళ్లుగా పవన్ కళ్యాణ్ తో ఆయనకు స్నేహం ఉంది. పవన్ వ్యక్తిత్వాన్ని దగ్గరగా చూసిన వాడిగా ఆయనేంటో బండ్ల గణేష్ కి బాగా తెలుసు. పవన్ పై బండ్ల గణేష్ ఎనలేని అభిమానాన్ని పెంచుకున్నాడు. బండ్ల గణేష్ నిర్మాతగా తీన్ మార్, గబ్బర్ సింగ్ చేశారు. గబ్బర్ సింగ్ పవన్ కెరీర్ లో భారీ హిట్ గా నిలిచింది. ఒక ఛాన్స్ ఇస్తే పవన్ తో పాన్ ఇండియా రికార్డ్స్ బద్దలు కొట్టే సినిమా తీస్తా అంటూ ఫ్యాన్స్ కి హామీ ఇస్తున్నాడు.
వరాలు ఇచ్చే గుడికి వెళ్దాం , దాంతోపాటు ప్రసాదం కూడా తిందాం , లేకపోతే టైం వేస్ట్. no time to live life is most important for our family ❤️🤝
— BANDLA GANESH. (@ganeshbandla) December 4, 2022