Bandla Ganesh Fired On NTR: బండ్ల గణేష్ ఎన్టీఆర్ 30 టీమ్ పై మండిపడ్డాడు. తన టైటిల్ కొట్టేశారంటూ ఆవేదన చెందాడు. పబ్లిక్ గా సంచలన కామెంట్స్ చేశాడు. బండ్ల గణేష్ ట్వీట్ వైరల్ అవుతుంది. మరి కాసేపట్లో ఎన్టీఆర్ 30 ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా ఫ్యాన్స్ కి దర్శకుడు కొరటాల శివ ట్రీట్ సిద్ధం చేశారు. కొరటాల శివ దేవర అనే టైటిల్ నిర్ణయించాడని తెలుస్తుంది. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. కాగా దేవర టైటిల్ బండ్ల గణేష్ ముందుగా రిజిస్టర్ చేయించుకున్నారు. ఆయన రెన్యువల్ చేయడం మర్చిపోవడంతో కొరటాల శివకు ఆ టైటిల్ దక్కింది.
తన టైటిల్ ని ఎన్టీఆర్ 30 యూనిట్ వాడుకోవడంపై బండ్ల గణేష్ అసహనం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేవర టైటిల్ నాది. నేను మర్చిపోవడంతో దాన్ని కొట్టేశారు, అని కామెంట్ పెట్టాడు. అలాగే కోప్పడుతున్నట్లు అర్థం వచ్చే ఎమోజి కూడా జోడించారు. బండ్ల గణేష్ పబ్లిక్ గా తన అసహనం బయటపెట్టడం సంచలనంగా మారింది. ఈ టైటిల్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం బండ్ల గణేష్ రిజిస్టర్ చేయించారు. పవన్ ని బండ్ల దేవర అని పిలుచుకుంటారు. దేవర పవన్ కి చక్కగా సరిపోతుందని బండ్ల గణేష్ భావన.
గతంలో బండ్ల గణేష్ బ్యానర్లో పవన్ తీన్ మార్, గబ్బర్ సింగ్ చిత్రాలు చేశారు. గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ గా ఉంది. ఆ మూవీలో పవన్ మేనరిజం, డైలాగ్స్ ఫ్యాన్స్ కి పిచ్చ కిక్ ఇచ్చాయి. గబ్బర్ సింగ్ వచ్చి దశాబ్దం దాటిపోగా మరలా వీరి కాంబినేషన్ సెట్ కాలేదు. బండ్ల గణేష్ ప్రయత్నాలు చేస్తున్నా కార్యరూపం దాల్చలేదు. ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తానని పట్టుదలతో ఉన్న బండ్ల గణేష్ దేవర టైటిల్ రిజిస్టర్ చేయించాడు. అనూహ్యంగా కొరటాల శివ చేతిలోకి ఆ టైటిల్ పోయింది.
బండ్ల గణేష్ ట్వీట్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మీరు మర్చిపోతే మా తప్పా. టైటిల్ ఫ్రీగా ఉంది కాబట్టే వాడుకున్నామని అంటున్నారు. మరి కాసేపట్లో ఎన్టీఆర్ 30 ఫస్ట్ లుక్ విడుదల కానుండగా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. 2024 సమ్మర్ కానుకగా విడుదల కానుంది.
దేవర నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న నా టైటిల్ నేను మర్చిపోవడం వల్ల నా టైటిల్ కొట్టేశారు 😡 https://t.co/Y4guc8Yl34
— BANDLA GANESH. (@ganeshbandla) May 19, 2023