పవన్ కల్యాణ్ ఆ పేరు వింటే చాలు కుర్రకారు ఉర్రూతలూగిపోతారు. సినిమా పరిశ్రమలో పవన్ కల్యాణ్ కు ఉన్న అభిమానులు ఎవరికి లేరనడంలో అతిశయోక్తి లేదు. పవన్ అంటే పవర్ అని నమ్ముతుంటారు. అంతటి కీర్తిని సొంతం చేసుకున్న పవన్ కల్యాణి్ రూటే సపరేట్. ఆయన ఎక్కడికి వెళ్లినా అభిమానులు కేరింతలు, చప్పట్లు, దండలతో ముంచెత్తుతారు.
ఈ నేపథ్యంలో ఆయనపై అభిమానుల ప్రేమ అంతా ఇంతా కాదు. ఆయనతో సినిమా చేయడానికి నిర్మాతలు సైతం క్యూ కడుతుంటారు. ఆయన డేట్స్ దొరికాయంటే అదో మహాభాగ్యంగా ఫీలవుతారు. ఇప్పుడు ఆయన భక్తుల్లో మొదటి స్థానంలో నిలిచే బండ్ల గణేష్ ఆయనతో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దానికి దేవర అనే పేరు ఖరారు చేస్తున్నట్లు సమాచారం. అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్న వవన్ ను కొత్తదనంలో చూపించేందుకు గణేష్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
బండ్ల గణేష్ అంటే ఓ నిర్మాత నటుడు, రాజకీయ వేత్తగా కూడా అందరికి తెలుసు. అలాంటి ఆయన కెమెరా ఫోకస్ మొత్తం తనవైపుకు తిప్పుకోవడంలో మహా దిట్ట. ఆడియో వేడుకలు, సినిమా ఫంక్షన్లలో హీరో మాటల కంటే మనోడి మాటలకే ఎక్కువ విలువ ఉంటుంది. ఇక తన దేవుడు పవన్ కల్యాణ్ తో ఓ సినిమా చేయడానికి రెడీ అయినట్లు చెబుతున్నాడు. దానికి దేవర అనే టైటిల్ ను ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గణేష్ గురించి చెప్పాలంటే ఈశ్వరా, పవనేశ్వరా, పవరేశ్వరా అంటూ తన భక్తిని చాటుతున్నాడు.
పవనే నా దేవుడు. నా ఆస్తి. నా సర్వస్వం అని బండ్ల గణేష్ చెబుతుంటాడు. ఇటీవల పవన్ కల్యాణ్ గురించి గణేష్ చేసిన కామెంట్స్ అభిమానుల్ని ఉర్రూతలూగించాయి. పవన్ అభిమానుల్లో జోష్ తగ్గినప్పుడల్లా గణేష్ స్పీచ్ లు ఫుల్ ఎనర్జీ డ్రింక్ గా పనిచేస్తాయని చెబుతుంటారు. అంతలా ఆరాధిస్తుంటాడు. ఎన్ని విమర్శలు వచ్చినా సరే తన అభిమానాన్ని చాటుతూనే ఉంటాడు. పవన్ కల్యాణ్ విషయంలో తగ్గేదేలే అని చెబుతాడు.
పవన్ కల్యాణ్ కు దేవర అనే టైటిల్ బాగుంటుందని ఆయన అభిమానులే సూచించారట. ఇప్పటికీ పవన్ అభిమానుల నుంచి రిక్వెస్ట్ లు వస్తూనే ఉంటాయి. తాజాగా జన సైనికులు ట్విటర్ లో దేవర అనే టైటిల్ పిక్స్ చేయి సూపర్ గా ఉంటుందని చెప్పారట. మొత్తానికి పవన్ అభిమానుల్లో కూడా మంచి రచయితలు ఉన్నట్లు తెలుస్తోంది. దేవర అనే టైటిల్ తో సినిమా చేయడానికి బండ్ల గణేష్ సైతం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ పవన్ ఎప్పటికి కరుణించి డేట్స్ ఇస్తారో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.