Homeఎంటర్టైన్మెంట్Degala Babji: ఆసక్తికరంగా 'డేగల బాబ్జీ' ట్రైలర్​.. బండ్ల గణేశ్​ యాక్టింగ్ ఇరగదీశారుగా!​

Degala Babji: ఆసక్తికరంగా ‘డేగల బాబ్జీ’ ట్రైలర్​.. బండ్ల గణేశ్​ యాక్టింగ్ ఇరగదీశారుగా!​

Degala Babji: నటుడిగా సినీ కెరీర్​ మొదలు పెట్టి ఆ తర్వాత నిర్మాతగా ప్రేక్షకులకు పరిచయమైన వ్యక్తి బండ్ల గణేశ్​. అయితే, ఇప్పటి వరకు హాస్యనటుడిగా, క్యారక్టర్​ ఆర్టిస్ట్​గా కనిపించిన ఈయన.. తొలుసారి హీరోగా వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. బండ్ల గణేశ్​ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సినిమా డేగల బాబ్జీ. క్రైమ్​, సస్పెన్స్ థ్రిల్లర్​గా రూపొందితోన్న సినిమా ఇది. వెంకట్​ చంద్ర ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా ట్రైలర్​ను విడుదల చేసింది చిత్రబృందం.

హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డేగల బాబ్జీ జైలుకెళ్తాడు. ఆ తర్వాత అతని జీవితంలో జరిగిన ఘటనలు, తీసుకున్న మలుపులు ఇలా ట్రైలర్​ ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా ఉంది. అన్ని ఎమోషన్స్​ను కనబరుస్తూ.. బండ్ల గణేశ్​ నటన ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.  ‘‘పుట్టగానే వాడు అస్సలు ఏడవలేదు. కానీ వాడు పుట్టినప్పటి నుంచి మేము ఏడుస్తూనే ఉన్నాం’’, ‘‘అస్సలు అమ్మ అందంగా ఉండాలన్న రూల్‌ ఏమైనా ఉందా’’ అంటూ బండ్ల గణేశ్‌ చెప్పే పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమాను షసష్రి ఫిల్మ్స్​ పతాకంపై స్వాతి నిర్మిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందు కనువిందు చేసేందుకు సిద్ధమవుతోంది.

కాగా, ఎప్పుడూ ఇంటర్వ్యూల్లో విభిన్నంగా మాట్లాడుతూ.. వార్తల్లో నిలుస్తుంటారు బండ్లగణేశ్​. ఈ క్రమంలోనే ఒకానొక సమయంలో మీమ్​ పేజీల్లో టాప్​ ట్రెండ్​గానూ నిలిచారు. కాగా, ఇప్పటి వరకు కమిడియన్​గా, క్యారక్టర్​ ఆర్టిస్ట్​గా అలరిచిన బండ్ల గణేశ్​.. ఇప్పుడు హీరోగా కనిపిస్తుండటంతో అభిమానుల్లో ఎక్కడలేని ఉత్సాహం నెలకొంది. మరి సినిమా ఎంత వరకు విజయం సాధిస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular