Corona star: కరోనా ఎవ్వరినీ వదలడం లేదు. అందరి రోగం తీర్చేస్తోంది. ఒకసారి కాదు.. రెండు సార్లు కాదు.. ఏకంగా మూడోసారి కూడా కరోనా బారిన పడుతున్నారు ప్రముఖులు. అదీ రెండు డోసుల టీకా వేసుకున్నాక కూడా కరోనా సోకుతోందంటే దాని పవర్ ఎంతో అర్థం చేసుకోవచ్చు.

మొదటి వేవ్ కరోనా బారినపడ్డా బండ్లగణేష్ ఇంట్లోనే చికిత్స తీసుకొని కోలుకున్నాడు. ఇక రెండో వేవ్ లో బలమైన డెల్టా వేరియంట్ బారిన పడి చావు అంచుల వరకూ వెళ్లారు. చివరకు ఆస్పత్రుల్లో బెడ్స్ ఖాళీగా లేకపోతే మెగాస్టార్ చిరంజీవి సాయం చేసి అపోలో ఆస్పత్రిలో ఒక బెడ్ అందిస్తే బతికి బయటపడ్డాడు. ఆ సమయంలో తనకు చాలా భయమేసిందని.. మెగాస్టార్ చిరంజీవి బెడ్ కనుక ఇప్పించకపోతే నా పరిస్థితి ఏమయ్యేదోనని బండ్ల నాటి భయానక పరిస్థితులను చెప్పుకొచ్చాడు.
అయితే తాజాగా మూడురోజులుగా ఢిల్లీలో ఉంటున్న బండ్ల గణేష్ హైదరాబాద్ కు వచ్చాడు. అయితే అక్కడి నుంచి రాగానే చిన్నగా కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో టెస్ట్ చేయించుకోగా మూడోసారి కరోనా బయటపడింది. ఈ మేరకు తనకు కరోనా మూడోసారి వచ్చిందని స్వయంగా రిపోర్టును బండ్ల గణేష్ షేర్ చేశాడు.
ఇక తనతోపాటు తన కుటుంబ సభ్యులకు కూడా టెస్ట్ చేయించానని.. వారికి నెగెటివ్ వచ్చిందని బండ్ల గణేష్ తెలిపారు.
ఢిల్లీలో ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరిగాయి. ఇక కరోనా డెల్టా కేసులు కూడా ఎక్కువయ్యాయి. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు.. థియేటర్లు మూసివేత.. సహా చాలా ఆంక్షలు పెట్టింది.అయినా కూడా రోజుకు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. అక్కడికి వెళ్లిన బండ్ల గణేష్ కూడా మూడోసారి కరోనా బారినపడ్డారు. మూడోసార్లు కరోనా వచ్చిన తెలుగు నటుడు బండ్ల గణేష్ మాత్రమే కావడం గమనార్హం.
https://twitter.com/ganeshbandla/status/1480188902258319362?s=20