Bandla Ganesh YCP: నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు బండ్ల గణేష్ తెలియని వారంటూ లేరు. ఎప్పుడూ ఏదో ఒకటి రాజేస్తూ వివాదాస్పద చర్యలతో వార్తల్లో నిలుస్తుంటాడు. సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉండే ఇతగాడు పవన్ కల్యాణ్ కు వీరాభిమాని. పవన్ కళ్యాణ్ ను ఎవరైనా ఏమైనా అంటే వెంటనే రంగంలోకి దిగి మరీ వారికి చుక్కలు చూపిస్తాడు. ఇక వర్తమాన రాజకీయ, సినీ అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటాడు.

తాజాగా ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ చేసిన అతి తెగ వైరల్ అవుతోంది. ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ మీకు వార్నింగ్ ఇచ్చాడని వార్తలు వస్తున్నాయని ఇది నిజమేనా? అని జర్నలిస్ట్ సూటిగా ప్రశ్నించాడు. దీనికి సీరియస్ అయిన బండ్ల గణేష్ వెంటనే వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు కాల్ చేశాడు. ‘హాయ్ అనిల్ అన్నా.. మీరు నాకు వార్నింగ్ ఇచ్చారా?’ అని ప్రశ్నించాడు. దానికి మాజీ మంత్రి అనిల్.. ‘నేను నీకు ఎందుకు వార్నింగ్ ఇచ్చాను అన్నా’ అంటూ ఆన్సర్ ఇచ్చాడు. వెంటనే బండ్ల గణేష్ ఇక్కడ అంటూ సదురు జర్నలిస్టుకు కౌంటర్ ఇచ్చాడు.
దీంతో బండ్ల గణేష్ కు వైసీపీ నేతలతో ఉన్న సాన్నిహిత్యం మరోసారి బయటపడింది. చూస్తుంటే తన బాస్ అయిన పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనను వదిలేసి వైసీపీలోకి బండ్ల గణేష్ చేరేలానే ఉన్నాడన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమాల పరంగా పవన్ ను అభిమానించే బండ్ల.. రాజకీయంగా మాత్రం వేరే అడుగులు వేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. చూడాలి మరీ బండ్ల గణేష్ రాజకీయాలు ఎటువైపు సాగుతున్నాయది.?
Bandla Ganeshhhh💥 pic.twitter.com/q2vwWGg08S
— Lɪᴋʜɪᴛᴇsʜ Cʜᴏᴡᴅᴀʀʏ ☄ (@LikhiteshChow) October 2, 2022