Bandla Ganesh: చాలామంది ఎన్నో ఆశలు పెట్టుకుని హీరోలుగా రాణించడానికి ఇండస్ట్రీకి వస్తారు. కానీ ఇక్కడ కొంతమందికి మాత్రమే అవకాశాలు వస్తాయి. వాళ్ళు మాత్రమే టాప్ రేంజ్ లో ముందుకు దూసుకెళ్తుంటారు. మిగిలిన వాళ్ళందరూ అవకాశాలు రాక, వచ్చిన ఉపయోగం లేక లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న బండ్ల గణేష్ సైతం ఒకప్పుడు హీరో అవ్వాలనే ఉద్దేశంతోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. 2002 వ సంవత్సరం లో తను హీరోగా ‘శీను గాడు’ అనే ఒక సినిమా కూడా స్టార్ట్ అయింది.
Also Read: లోకేష్ తలచుకుంటే అంతే!
బాబ్జి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కొన్ని షెడ్యూల్స్ పూర్తయిన తర్వాత అనుకోకుండా ప్రొడ్యూసర్ మరణించడంతో మూవీ ఆగిపోయింది. ఇక అప్పుడు మరి కొంతమంది ప్రొడ్యూసర్లు ఈ సినిమా కాన్సెప్ట్ విని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చినప్పటికి అప్పుడున్న కొంతమంది స్టార్ హీరోలు బండ్ల గణేష్ ని హీరో అవ్వకుండా ఆ సినిమాని ఆపేసారట.
మొత్తానికైతే బండ్ల గణేష్ అప్పట్లో హీరోగా తన కెరియర్ ను మొదలుపెట్టి ఉంటే ఇప్పుడు స్టార్ హీరో అయ్యేవాడు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికైతే కామెడీ ఆర్టిస్ట్ గా రాణించి ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా కూడా తన సత్తా చాటుకున్న బండ్ల గణేష్ ప్రస్తుతం ఇండస్ట్రీ వన్ ఆఫ్ ది టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నాడు. ఇక తన బ్యానర్ లో ఇప్పుడు చిన్న సినిమాలను ప్రొడ్యూస్ చేయాలనే ఉద్దేశ్యంతో ఆయన ముందుకు సాగుతున్నాడు…
గతంలో పవన్ కళ్యాణ్ తో చాలా సన్నిహిత్యంగా ఉన్న బండ్ల గణేష్ ఆయనతో తీన్మార్, గబ్బర్ సింగ్ లాంటి సినిమాలను ప్రొడ్యూస్ చేశాడు. కానీ ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ మధ్య కొంచెం దూరం పెరిగింది. వీళ్ళు తరచుగా కలుసుకోకపోయిన కూడా బండ్ల గణేష్ ఇప్పటికి పవన్ కళ్యాణ్ తన దేవుడు అని చెబుతూ ఉంటాడు. తనకు ఇండస్ట్రీలో కెరియర్ ఇచ్చిన వాళ్ళలో పవన్ కళ్యాణ్ మొదటి స్థానంలో ఉంటాడని చాలా గర్వంగా చెబుతుంటాడు…