Bunny Vasu vs Bandla Ganesh: వరుస హిట్స్ తో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాత బన్నీ వాసు(Bunny Vasu) నిర్మించిన లేటెస్ట్ చిత్రం ‘మిత్రమండలి'(Mithra Mandali Movie) నేడు భారీ లెవెల్ లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. విడుదలకు ముందు ఈ సినిమా చాలా హంగామానే చేసింది. ట్రైలర్, టీజర్ లతో యూత్ ఆడియన్స్ మెచ్చే విధంగా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దాము అని, కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనే నమ్మకాన్ని కలిపించడం లో సక్సెస్ అయ్యారు మేకర్స్. దానికి తోడు రీసెంట్ గా బన్నీవాసు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన సినిమాని, పోటీ లో వస్తున్న మరో సినిమా నిర్మాతలు టార్గెట్ చేసి తొక్కే ప్రయత్నం చేస్తున్నారని, ఇష్టమొచ్చినట్టు మా చిత్రం పై విడుదలకు ముందే నెగిటివ్ క్యాంపైన్ చేస్తున్నారని, కానీ వాళ్ళు నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.
ఇంతకీ ఆయన సినిమా పై నెగిటివ్ ప్రచారం చెయ్యాలని అనుకున్నది ఎవరు?, సోషల్ మీడియా లో విడుదలకు ముందు ‘మిత్ర మండలి’ చిత్రం ఎలాంటి నెగిటివ్ పోస్టులు కనపడలేదే, మరి బన్నీ వాసు ఎవరిని ఉద్దేశిస్తూ ఈ కామెంట్స్ చేసాడు అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అర్థం అవ్వక జుట్టు పీక్కున్నారు. ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనని, ఆయన సినిమాని ఎవ్వరూ టార్గెట్ చేయలేదని నెటిజెన్స్ కొంతమంది చెప్పుకొచ్చారు. అయితే బన్నీ వాసు చేసిన ఈ కామెంట్స్ పై ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్(Bandla Ganesh) కాసేపటి క్రితమే కౌంటర్ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘అది పీకుతా..ఇది పీకుతా అని మనం చెప్పాల్సిన పని లేదు. మాటలు మన చేతిలో ఉన్నా, ఆట ఎవరిదో జనాలు తీర్మానిస్తారు’ అంటూ ఒక ట్వీట్ వేసాడు. ‘మిత్రమండలి’ చిత్రం నేడు గ్రాండ్ గా విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో, ఆ ఫలితాన్ని ఉద్దేశించి బండ్ల గణేష్ ఈ ట్వీట్ వేసినట్టు తెలుస్తుంది.
ఇంతకీ బండ్ల గణేష్, బన్నీ వాసు మధ్య గొడవలు ఏర్పడడానికి ‘లిటిల్ హార్ట్స్’ సక్సెస్ ఈవెంట్ కారణమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా బన్నీ వాసు గ్రాండ్ గా రిలీజ్ చేసాడు. పెద్ద హిట్ అవ్వడం తో సక్సెస్ ఈవెంట్ ని ఏర్పాటు చేసి, అల్లు అరవింద్ తో పాటు, బండ్ల గణేష్, విజయ్ దేవరకొండ వంటి వారితో పాటు, పలువురు సెలబ్రిటీలను ముఖ్య అతిథి గా పిలిచాడు. ఈ ఈవెంట్ లో బండ్ల గణేష్ మాట్లాడుతూ ‘అల్లు అరవింద్ అదృష్టవంతుడు. ఆయన ఏ పని చేయడు, ఆయన పక్కనే ఉండే బన్నీ వాసు నే మొత్తం చేస్తాడు. సినిమా పూర్తి అయ్యాక చొక్కా నలగకుండా వచ్చి ఈవెంట్ లో కూర్చొని ఎంజాయ్ చేస్తాడు, లాభాలను మూటగట్టుకొని వెళ్తాడు’ అని అంటాడు. ఈ మాటలకు బన్నీ వాసు రియాక్ట్ అయ్యి బండ్ల గణేష్ ని తప్పు బట్టడం, అప్పటి నుండి వీళ్లిద్దరి మధ్య కోల్డ్ వార్ జరగడం మొదలయ్యాయి.
“అది పీకుతా ఇది పీకుతా అని మనం చెప్పాల్సిన పని లేదు… మాటలు మన చేతిలో ఉన్నా, ఆట ఎవరిదో జనాలు తీర్మానిస్తారు……!
— BANDLA GANESH. (@ganeshbandla) October 16, 2025