
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పరమభక్తుడిని అని ప్రమోట్ చేసుకునే నిర్మాత బండ్ల గణేష్, ప్రస్తుతం పవర్ స్టార్ కోసం కథను వెతికే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో ఓ తమిళ యువ రచయిత జాన్ అనే అతని దగ్గర, బండ్ల ఒక కథను ఓకే చేసినట్లు తెలుస్తోంది. త్వరలో పవన్ కు కూడా ఆ కథ వినిపించనున్నారు. కథలో పవన్ పాత్ర కాస్త కొత్తగా ఉంటుందని.. కాలేజీ లెక్చరర్ గా పవన్ సినిమాలో కనిపిస్తారని సమచారం. మరి కాలేజీ నేపథ్యంలో సినిమా అంటే.. అది పవన్ లెక్చరర్ పాత్ర అంటే.. ఆసక్తి రెట్టింపు అయ్యేలా ఉంది. ఏది ఏమైనా అభిమానులు ఎంతమంది ఉన్నా.. పవన్ కి బండ్ల గణేష్ లాంటి పరమభక్తుడు మాత్ర ఇంకొకరు లేరు.
Also Read: ఎఫ్-2కు జాతీయ అవార్డు.. ఫ్రస్టేషన్ ఎందుకంట?
అందుకే బండ్లకు పవర్ స్టార్ ఎట్టకేలకూ మళ్లీ ఓ సినిమాని నిర్మించే అవకాశం ఇచ్చాడు. ఆ మాటకొస్తే ఎప్పటి నుండో బండ్లకు పవన్ తో మళ్ళీ మరో సినిమా చేయాలని ఓ కల ఉంది. ఆ కల కోసం బండ్ల చాలానే ప్లాన్స్ వేసాడట. మరో నిర్మాతకు తెలియకుండా సైలెంట్ గా గత కొన్ని నెలలుగా పవన్ ను ఒప్పించడానికి బండ్ల చాలా ప్రయత్నాలు చేశాడని.. పైగా లాభాల్లో వాటా కూడా ఇస్తున్నాడని తెలుస్తోంది. నిజానికి పవన్ కళ్యాణ్ ఇప్పటికే వేరే నిర్మాతలతో మూడు సినిమాలు కమిట్ అయ్యాడు. ఇలాంటి పరిషత్తుల్లో లెక్క ప్రకారం బండ్లకు పవన్ చాన్స్ ఇవ్వకూడదు. కానీ పవన్, బండ్లతో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
Also Read: జానీ మాస్టర్ మాటలకు తెగ ఫీల్ ఆయిన అనసూయ !
అందుకు కారణం సినిమా లాభాల్లో ఎక్కువ శాతం పవన్ కే వాటా ఉందట. ఇక ఇప్పటికే బండ్ల ఓ స్టార్ డైరెక్టర్ ను కూడా సంప్రదించాడని.. ఎలాగూ కాంబినేషన్ లను సెట్ చేసి.. సినిమాలను తీయడంలో బండ్లకు బట్టర్ తో పెట్టిన విద్య కాబట్టి, ఈ సినిమా కోసం ఎవరొక స్టార్ డైరెక్టర్ ను తీసుకొస్తాడు. పైగా పవన్ కళ్యాణ్ హీరో.. ఏ స్టార్ డైరెక్టర్ అయినా డేట్స్ ఎడ్జెస్ట్ చేసి మరీ సినిమా చేయడానికి ఒప్పుకుంటాడు. ఆ మధ్య పవన్ కల్యాణ్ – పరుశురామ్ కాంబినేషన్ లో బండ్ల గణేష్ సినిమా ప్లాన్ చేసాడని.. ‘సర్కారు వారి పాట’ పూర్తవ్వగానే ఈ సినిమా మొదలవుతుందని వార్తలు వచ్చాయి. మరి ఈ వార్త నిజం అవుతుందేమో చూడాలి.
Comments are closed.