Bandla Ganesh Diwali Party : టాలీవుడ్‌లో తనదైన స్టైల్‌తో, మాటలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఈసారి దీపావళి వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చేశారు. ప్రీ-రిలీజ్ ఫంక్షన్లలో పవన్ కళ్యాణ్ పట్ల తనకున్న అభిమానాన్ని ప్రదర్శిస్తూ.. చేసిన వ్యాఖ్యల వల్ల ఇప్పటికే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా ఉన్న బండ్ల గణేష్, తాజాగా ఒక గ్రాండ్ పార్టీ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు.
Super Hero @tejasajja123 made a grand entry at the Diwali celebrations hosted by #BandlaGanesh in Hyderabad!
The star-studded night just got more vibrant with his presence. #Diwali2025 @ganeshbandla#Mirai pic.twitter.com/OAZrMKbGm8— SNR_Talks (@SNR_Talks) October 18, 2025
ప్రతి ఏటా దీపావళికి భారీగా టపాసులు కాల్చి తన ప్రత్యేకతను చాటుకునే బండ్లన్న, ఈసారి తన ఇంట్లో ఏకంగా తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులందరికీ ఒక పెద్ద విందు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ పార్టీకి మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు ముఖ్య అతిథిగా హాజరవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
Megastar @KChiruTweets garu at the grand Diwali celebrations hosted by #BandlaGanesh in Hyderabad! #Diwali2025 @ganeshbandla pic.twitter.com/XJZy0Ag3yV
— Vamsi Kaka (@vamsikaka) October 18, 2025
ఈ గ్రాండ్ పార్టీకి మెగాస్టార్ చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేశ్, శ్రీకాంత్, సిద్దు జొన్నలగడ్డ, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు, హరీష్ శంకర్ వంటి పలువురు అగ్ర హీరోలు, దర్శకులు, నిర్మాతలు హాజరయ్యారు. చిరంజీవి కారు దిగగానే బండ్ల గణేష్ ఆయన కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకోవడం ఈ పార్టీలో హైలైట్‌గా నిలిచింది. ఈ సంఘటన బండ్ల గణేష్‌కి మెగాస్టార్‌పై ఉన్న అపారమైన గౌరవాన్ని, అభిమానాన్ని మరోసారి చాటింది.
Industry Celebs at the grand Diwali celebrations hosted by #BandlaGanesh in Hyderabad! pic.twitter.com/oYaHU7epnA
— TrackTollywood (@TrackTwood) October 18, 2025
సినిమా నిర్మాణంలో తిరిగి క్రియాశీలకంగా మారాలని బండ్ల గణేష్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో, ఇండస్ట్రీ మొత్తాన్ని ఒకే వేదికపైకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతోనే ఆయన ఈ భారీ దీపావళి పార్టీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
ఏది ఏమైనా, తన మాటలతోనే కాదు.. ఇలాంటి గ్రాండ్ పార్టీలతోనూ ఇండస్ట్రీలో తన మార్క్‌ను చూపించడంలో బండ్ల గణేష్ మరోసారి సక్సెస్ అయ్యారు.