Bandla Ganesh: ఈవెంట్స్ లో మైక్ దొరికిందంటే చాలు కొంతమంది సెలబ్రిటీలు పూనకాలు వచ్చి ఊగిపోతుంటారు. నోటికి ఎదోస్తే అది మాట్లాడేస్తూ ఉంటారు. అలా మాట్లాడితే పబ్లిసిటీ దొరుకుంటుందని అనుకుంటారో ఏమో తెలియదు కానీ, ఈమధ్య చిన్న సినిమా హిట్ అయితే చాలు, మన బండ్లన్న (బండ్ల గణేష్)(Bandla Ganesh) సక్సెస్ ఈవెంట్స్ లో వాలిపోతున్నాడు. ఈవెంట్ కి వచ్చి, సినిమా గురించి నాలుగు మాటలు మాట్లాడి వెళ్తే ఏమి కాదు. మన బండ్లన్న అలాంటి టైపు కాదు కదా, ఆయన మైక్ అందుకున్నాడంటే ఎదో ఒక సంచలనం ఉండాల్సిందే. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కి ఒక్కటే భజన చేసేవాడు, ఇప్పుడు ఈవెంట్ కి వెళ్లిన ప్రతీ హీరో భజన చేస్తున్నాడు. పోనీ భజన తో ఆపెస్తాడా అంటే అది కూడా లేదు, పక్క హీరో ని ఎగతాళి చేస్తూ మాట్లాడేస్తున్నాడు. రీసెంట్ గానే ఆయన K ర్యాంప్ సక్సెస్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే.
దీపావళి కానుకగా విడుదలైన K ర్యాంప్ చిత్రం, కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్టై, విన్నర్ గా నిల్చింది. అలాంటి సినిమా సక్సెస్ ఈవెంట్ లో బండ్ల గణేష్ విజయ్ దేవరకొండ ని ఉద్దేశించి మాట్లాడిన మాటలు పెద్ద దుమారమే రేపింది. ఈమధ్య కాలం లో కొంతమంది హీరోలు ఒకటి రెండు సినిమాలు హిట్టు కొట్టగానే లూజు ప్యాంట్లు, చీకట్లో కూడా అడ్డలేసుకొని తిరుగుతూ, వాట్సాప్..వాట్సాప్ అని అంటున్నారు అంటూ విజయ్ దేవరకొండ ని పరోక్షంగా విమర్శించాడు. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ బండ్ల గణేష్ ని ట్యాగ్ చేసి ఒక రేంజ్ లో తిట్టసాగారు. దీనికి స్పందించిన బండ్ల గణేష్ పుండు మీద కారం చల్లినట్టు ‘ఈమధ్యనే నేను K ర్యాంప్ సక్సెస్ ఈవెంట్ లో మాట్లాడిన మాటలు కొందరిని బాధపెట్టాయని తెలిసింది. ఆ వ్యాఖ్యలు నేను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడినవి కాదు. నా ఉద్దేశ్యం అందరూ బాగుండాలి, కళామ్మ తల్లి ఆశీస్సులతో అందరూ బాగా పైకి ఎదగాలి’ అంటూ ఒక ట్వీట్ వేసాడు.
సైలెంట్ గా ఉన్నా సరిపోయేది కదా?, ఈ ట్వీట్ అవసరమా బండ్లన్నా?, ‘వాట్సాప్..వాట్సాప్ మై రౌడీ బాయ్స్’ అని మాట్లాడేది విజయ్ దేవరకొండ అని తెలియనోళ్లు ఎవరు ఇక్కడ?, నువ్వు ఆయన్ని ఉద్దేశించే మాట్లాడావు, అందులో ఎలాంటి సందేహం లేదు, కవరింగ్స్ వద్దంటూ కామెంట్స్ చేస్తున్నారు. బండ్ల గణేష్ కి ఈమధ్య కాలం లో ఇలాంటివి అలవాటు అయిపోయింది. మనోడి ప్రసంగాలు పెద్ద ఇబ్బందికి గురి చేస్తున్నాయి అనే విషయాన్ని అర్థం చేసుకొనే, పవన్ కళ్యాణ్ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి బండ్ల గణేష్ ని రానివ్వకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ అడ్డుగా నిల్చున్నాడు. ఇప్పుడు ఈ బండ్లన్న చిన్న సినిమాల చుట్టూ తిరుగుతున్నాడు.