Jawan Movie Bangladesh: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ హీరోగా, తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన భారీ యాక్షన్ సినిమా జవాన్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 వేల స్క్రీన్స్ మీద విడుదలైన ఈ సినిమా అన్ని చోట్ల యూనానిమస్ గా పాజిటివ్ టాక్ ని సంపాదించి భారీ కలెక్షన్స్ దిశగా వెళ్తుంది.
అయితే మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్ లో మాత్రం ఈ సినిమా విడుదల కాలేదు. దీంతో అక్కడి షారుఖ్ ఫ్యాన్స్ రోడ్డెక్కి నిరసన లు వ్యక్తం చేస్తున్నారు. గతంలో షారుఖ్ నటించిన పఠాన్ సినిమా కూడా ఆలస్యంగానే అక్కడ విడుదల అయ్యింది. అయితే అనుకున్న టైం కి విడుదల కాకపోవడానికి కారణాలు కూడా లేకపోలేదు. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో రాజకీయ గందరగోళం నడుస్తుంది. వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటంతో స్థానిక ప్రభుత్వం మీద అక్కడ భారీ వ్యతిరేకత ఉంది.
దీంతో అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సమయంలో అక్కడి ప్రభుత్వం అనేక చోట్ల కర్ఫ్యూ విధించింది. ఇలాంటి టైం జవాన్ సినిమా విడుదల చేయడం కరెక్ట్ కాదని బంగ్లాదేశ్ సెన్సార్ బోర్డు సినిమా విడుదలకు ఒప్పుకోలేదు. అందుకే అక్కడ జవాన్ విడుదల ఆలస్యం అయ్యేలా ఉంది. మరోవైపు షారుఖ్ ఖాన్ అభిమానులు మాత్రం సినిమా విడుదల చేయాల్సిందే అంటూ నిరసన లు వ్యక్తం చేస్తున్నారు.
ఇక జవాన్ విషయానికి వస్తే తొలిరోజే భారీ వసూళ్లు సాధించి, ఇండియన్ సినిమా రికార్డ్స్ ని బద్దలు కొట్టింది. మొదటిరోజు ఇండియాలో 75 కోట్లు నెట్ వసూళ్లు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో పఠాన్ 55 కోట్లు, KGF 2 54 కోట్లు, బాహుబలి 41 కోట్లు నెట్ సాధించిన సినిమాలు. ఇప్పుడు జవాన్ వాటన్నింటిని చెరిపేసింది. ఇక తొలిరోజు వరల్డ్ వైడ్ గా దాదాపు 125 కోట్ల నెట్ సాధించినట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇక సినిమాకు కూడా మంచి టాక్ రావడంతో ఈజీగా ఈ సినిమా మరో 1000 కోట్లు సాధించే అవకాశం ఉంది.