Balayya stunt viral: సీనియర్ హీరోలలో ప్రస్తుతం బాలయ్య బాబు(Nandamuri Balakrishna) కెరీర్ పరంగా ఏ రేంజ్ పీక్ ని ఎంజాయ్ చేస్తున్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. ‘అఖండ’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తో సరికొత్త ఇన్నింగ్స్ ని మొదలు పెట్టిన బాలయ్య, ఆ తర్వాత ‘వీర సింహా రెడ్డి’, ‘భగవంత్ కేసరి’, ‘డాకు మహారాజ్’ లతో హ్యాట్రిక్ హిట్స్ ని అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను తో ‘అఖండ 2′(Akhanda 2 ) చేస్తున్నాడు. ఈ చిత్రం కోసం అటు నందమూరి అభిమానులు ఎంతలా ఎదురు చూస్తున్నారో, సినీ అభిమానులు కూడా అంతే ఎదురు చూస్తున్నారు. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 25 న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారు కానీ, ఆ తేదీన రావడం దాదాపుగా కష్టమే. ‘అఖండ’ లాగానే ‘అఖండ 2’ కూడా డిసెంబర్ నెలలోనే విడుదల కాబోతుంది.
Also Read: ఖడ్గం సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ చేసిన క్యారెక్టర్ బాలకృష్ణ గారిదా..? వైరల్ వీడియో…
ఇదంతా పక్కన పెడితే బాలయ్య కి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. రీసెంట్ గానే నార్త్ అమెరికా లో TANA ఉత్సవాలు ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలకు బాలకృష్ణ తో పాటు, విక్టరీ వెంకటేష్(Victory Venkatesh), అల్లు అర్జున్(Icon Star Allu Arjun), శ్రీలీల(Sreeleela) తదితరులు హాజరయ్యారు. అయితే శ్రీలీల బాలయ్య పక్కన కూర్చొని ఉండగా, బాలయ్య స్టైల్ గా ఆమె ముందు ఫోజు కొడుతూ ఎగిరి ఫర్నీచర్ లో కూర్చున్న వీడియో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో ని చూసిన అభిమానులు బాలయ్య లో ఇంకా కుర్రతనం అసలు పోలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అదే ఎనర్జీ, అదే జోష్, టీనేజ్ లో బాలయ్య లో ఎలా ఉండేవాడో, ఇప్పుడు కూడా అలాగే ఉంటున్నాడు. బాలయ్య వచ్చిన రోజునే విక్టరీ వెంకటేష్ కూడా ఆ ఈవెంట్ కి వచ్చాడు.
Also Read: హీరో ఎవరైనా, జానర్ ఏదైనా త్రివిక్రమ్ సినిమాలో ఈ సీన్స్ ఉండాల్సిందేనా..? వైరల్ వీడియో…
బాలయ్య వెంకీ తో మాట్లాడుతూ ‘పదా పైకి వెళ్లి మనిద్దరం డ్యాన్స్ చేద్దాం’ అని అంటాడు. అందుకు వెంకటేష్ ఆమ్మో నా వల్ల కాదు, కావాలంటే నువ్వు వెళ్లి చెయ్యి అని సంభాషించడం హైలైట్ గా మారింది. కేవలం ఈ ఒక్క ఈవెంట్ లో మాత్రమే కాదు, గద్దర్ అవార్డ్స్ ఈవెంట్ లో కూడా ఇంతే. అల్లు అర్జున్ పక్కన కూర్చున్న బాలయ్య, పైన పాట రాగానే పదా వెళ్లి డ్యాన్స్ చేద్దాం అనడం, అల్లు అర్జున్ ఆమ్మో నావల్ల కాదు బాబోయ్ అంటూ దండం పెట్టడం మనం చూసాము. ఆ వీడియో కూడా సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ అయ్యింది. ఇలా బాలయ్య ఈ వయస్సు లో చూపిస్తున్న ఎనర్జీ ని చూసి, ఆయన వయస్సు ఇంకా పాతికేళ్ల దగ్గరే ఆగిపోయింది అంటూ నందమూరి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.