Homeఎంటర్టైన్మెంట్బాలయ్యకి విలన్ కాదు, యంగ్ హీరో కావాలట !

బాలయ్యకి విలన్ కాదు, యంగ్ హీరో కావాలట !

నట సింహం బాలయ్య బాబు హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో ఓ విలన్ రోల్ ఉంది. ఆ రోల్ లో మొదట సంజయ్ దత్ అయితే బాగుంటుంది అనుకున్నారు.. బడ్జెట్ సమస్య.. సంజయ్ ను భరించే శక్తి లేదు. జగపతి బాబునే బెటర్ అన్నారు. కానీ డేట్స్ సమస్య. చివరకు వద్దనుకున్నారు. ఇక బాలకృష్ణకి విలన్ గా డా రాజశేఖర్ అయితేనే బాగుంటుంది అనుకున్నారు. రాజశేఖర్ నటించబోతున్నాడు అంటూ వార్తలు వచ్చేశాయి. […]

Balakrishna
నట సింహం బాలయ్య బాబు హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో ఓ విలన్ రోల్ ఉంది. ఆ రోల్ లో మొదట సంజయ్ దత్ అయితే బాగుంటుంది అనుకున్నారు.. బడ్జెట్ సమస్య.. సంజయ్ ను భరించే శక్తి లేదు. జగపతి బాబునే బెటర్ అన్నారు. కానీ డేట్స్ సమస్య. చివరకు వద్దనుకున్నారు. ఇక బాలకృష్ణకి విలన్ గా డా రాజశేఖర్ అయితేనే బాగుంటుంది అనుకున్నారు. రాజశేఖర్ నటించబోతున్నాడు అంటూ వార్తలు వచ్చేశాయి. ఈ సినిమాలో సీనియర్ బాలయ్యకు ఓ విలన్ పాత్ర ఉందని, ఈ పాత్రలోనే రాజశేఖర్ నటించబోతున్నాడు అని ఆ వార్తల సారాంశం.

Also Read: టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారిన సునీత రెండో పెళ్లి..!

కట్ చేస్తే.. ఈ వార్త కూడా నిజం కాదు అని బోయపాటి క్లారిటీ ఇచ్చాడు. అసలు విలన్ పాత్ర కోసం రెగ్యులర్ విలన్ సరిపోతాడని.. అయితే సినిమాలో ఒక యంగ్ హీరో పాత్ర ఉందని.. అది బాలయ్య అసిస్టెంట్ పాత్ర అని, అయితే అసిస్టెంట్ రోల్ అయినా, ప్లాష్ బ్యాక్ లో వచ్చే ఈ రోల్ కాస్త కీలకమైనది అని తెలుస్తోంది. అందుకే కొంచెం ఫేమ్ ఉన్న హీరో అయితే బెటర్ అని ఈ రోల్ కోసం మొదట నవీన్ పొలిశెట్టిని తీసుకుందామనుకున్నా.. అది ముందుకు వెళ్ళలేదు. మొత్తానికి ఫామ్ లో ఉన్న యంగ్ హీరో బాలయ్య సినిమాలో నటించడానికి ఒప్పుకుంటారా అంటే అనుమానమే.

Also Read: సూపర్ స్టార్ ఈ సారైనా క్లారిటీ ఇస్తాడా లేదా ?

పోనీ ఫామ్ లో లేని ఎవరేజ్ హీరోలు కూడా బాలయ్య సినిమాలో చేయడానికి ముందుకు రాని పరిస్థితినే ఉందనేది ఇప్పటికే బోయపాటికి అర్ధం అయిపొయింది. ఏ హీరోని కదిలించినా సైలెంట్ గా తప్పించుకు తిరుగుతున్నారట. మరి బోయపాటి ఏం చేస్తాడో చూడాలి. ఇక ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా.. మ్యూజిక్ సెన్సేషనల్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా టీజర్ లో బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ అండ్ దుమ్ము రేపే యాక్షన్ తో అభిమానులను బాగానే ఆకట్టుకున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper