KCR- Central Government: కేంద్రాన్ని కడిగేస్తాను.. ‘సర్ఫ్ ఎక్సెల్’ వేసి ఉతికేస్తాను అంటూ ఢిల్లీ బయలు దేరిన కేసీఆర్ సార్ కు పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవని అర్థమయ్యాయి. అందుకే గప్ చుప్ గా ఢిల్లీ పర్యటనను అర్థాంతరంగా ముగించేసి ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్ లో సేదతీరుతున్నారు. ప్రత్యర్థి బలంగా ఉన్నప్పుడు.. తెలంగాణ ప్రభుత్వాన్ని ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం.. పైగా ప్రతిపక్షాలు, కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలను ఒకగాటిన కట్టడం అయ్యే పని కాదని కేసీఆర్ కు అర్థమైంది. అందుకే బీజేపీని ఎదురించలేక ‘మౌనమే’ ఆయన భాష అయ్యింది.
జాతీయ రాజకీయాల్లో ముద్ర వేస్తానని బయలు దేరిన కేసీఆర్ పంజాబ్ వెళ్లి అక్కడ రైతు ఉద్యమంలో చనిపోయిన రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు. పంజాబ్, ఢిల్లీ సీఎంలతో కలిసి జాతీయ రాజకీయాల్లో ఒక్కసారిగా వెలిగారు. కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి జీతాలు, పెన్షన్లు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడం.. కేసీఆర్ సర్కార్ కు రూపాయి ఇవ్వం పొమ్మని కేంద్రం కఠిన ఆంక్షలు పెట్టడంతో గప్ చుప్ గా హైదరాబాద్ వచ్చేశారు కేసీఆర్. అప్పటి నుంచి ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్ కే పరిమితం అయ్యారు.
Also Read: Jagan On MLAs: వ్యతిరేకత ఎమ్మెల్యేలకు.. అధికారం జగన్ కా?
రాష్ట్రపతి ఎన్నికలను టార్గెట్ చేసిన కేసీఆర్.. దేశంలో మరో సంచలనానికి నాంది పడుతోందని ఇటీవల ఢిల్లీ, కర్నాటక వెళ్లినప్పుడు ఘనంగా చాటారు. అదేంటంటే.. ‘సామాజిక ఉద్యమకారుడు ’ అయిన అన్నాహాజరేను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టి కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీల మద్దతుతో రాష్ట్రపతిగా గెలిపించాలని.. ఈ మేరకు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని కేసీఆర్ భారీ స్కెచ్ గీశారు. బీజేపీకి రాష్ట్రపతి ఎన్నికల్లో 50శాతం ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఇంకో 50శాతం ప్రతిపక్షాలకు ఉన్నాయి. దీంతోనే గెలవడానికి కేసీఆర్ ప్లాన్ చేశారు. అయితే కేంద్రంలోని మోడీ సర్కార్ అన్ని వైపుల నుంచి కేసీఆర్ పై ఒత్తిడి తేవడంతో ఇప్పుడు సైలెంట్ అయిపోయి ఫాంహౌస్ కు వెళ్లిపోయారు.
ఇక అనూహ్యమైన ఘటన ఏంటంటే.. మంత్రి కేటీఆర్ ఢిల్లీ వెళ్లి.. బీజేపీ అధిష్టానంలో కీలక రాజకీయ వ్యూహకర్త, కేంద్రమంత్రి అయిన రాజీవ్ చంద్రశేఖర్ ను కలవడం హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాతే కేసీఆర్ రాష్ట్రపతి ఎన్నికలపై మౌనం దాల్చడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజీవ్ చంద్రశేఖర్ తో కేటీఆర్ సంధి చేసుకున్నారని.. బీజేపీకి వ్యతిరేకంగా రాష్ట్రపతి అభ్యర్థిని తెరపైకి తేకుండా కేసీఆర్ తో బీజేపీ రాజీ చేసుకుందన్నా గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఏం జరిగిందో ఏమో కానీ.. రాష్ట్రపతి ఎన్నికల ముచ్చటే లేకుండా కేసీఆర్ సైలెంట్ అయ్యారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నా హాజరే ను రాష్ట్రపతిగా నిలబెట్టి పోరాటం చేయలేమని డిసైడ్ అయ్యారు. అలాగే కాంగ్రెస్ నిలబెట్టే అభ్యర్థికి మద్దతిస్తే ఇబ్బందికరమే. అలాగని బీజేపీ ప్రతిపాదించే వ్యక్తిని రాష్ట్రపతిగా నిలబెట్టలేం. అందుకే ఇక వీటన్నింటికి దూరంగా కేసీఆర్ ఫాంహౌస్ లో మౌనంగా ఉండడమే బెటర్ అని అటు వైపు వెళ్లినట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది.
Also Read: AP SSC Results: పదో తరగతి పరీక్ష ఫలితాల ప్రకటనలో ఏపీ సర్కారు తొండాట