Aunt ran away with her son-in-law: వారి వరుసలు లేవు. సమాజం ఏమనుకుంటుందోననే సోయిలేదు. ఒక రకంగా మనుషులకంటే జంతువులు నయం అనేటట్టుగా పరిస్థితి మారిపోయింది.. పైగా విచక్షణ కోల్పోయి ఏర్పరచుకుంటున్న సంబంధాలను కాపాడుకునేందుకు మనుషులు అత్యంత నీచంగా ప్రవర్తిస్తున్నారు. క్రూరంగా వ్యవహరిస్తున్నారు. సొంత మనుషులను చంపడానికి కూడా వెనుకంజ వేయడం లేదు. ఇటీవల కాలంలో ఈ తరహ సంఘటనలు దేశవ్యాప్తంగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు అరెస్టులు చేస్తున్నప్పటికీ.. న్యాయస్థానాలు శిక్షలు విధిస్తున్నప్పటికీ చాలామందిలో మార్పు రాకపోవడం మారిపోయిన పరిస్థితికి అద్దం పడుతోంది. ఇన్ని జరుగుతున్నప్పటికీ దారుణాలకు.. ఘోరాలకు అడ్డుకట్ట పడకపోవడం విశేషం. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో మరో విస్మయకర సంఘటన చోటుచేసుకుంది.
కర్ణాటక రాష్ట్రంలోని దావణగెరె ప్రాంతంలో దారుణం జరిగింది. అల్లుడుతో కలిసి ఓ అత్త ఇంటి నుంచి పారిపోయింది. ఆమెకు 55 సంవత్సరాలు. ఆమె కూతురికి సరిగ్గా రెండు నెలల క్రితం ఒక యువకుడితో పెళ్లి చేసింది. మొదట్లో అత్త – అల్లుడు బాగానే ఉండేవారు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. అల్లుడిని అత్త ముగ్గులోకి దించింది. అతడిని రెచ్చగొట్టింది. వలపు బాణాలు వేసి వశపరచుకుంది. అత్త రెచ్చగొడుతుండడంతో తట్టుకోలేకపోయాడు. పైగా ఆమెకు ఒక బలహీనమైన క్షణంలో లొంగిపోయాడు. అప్పటినుంచి వారిద్దరి మధ్య సరసాలు, సల్లాపాలు సాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఆమె కూతురు ఒకరోజు తన భర్త మొబైల్ చూసింది. అందులో తన తల్లి, భర్త ఏకాంతంగా ఉన్న దృశ్యాలు కనిపించడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. గుండెలు పగిలే విధంగా ఏడ్చింది. ఇదే విషయంపై భర్తను నిలదీసింది. తల్లిని ప్రశ్నించింది. దీంతో వారిద్దరు తలవంచుకున్నారు. తప్పయిందని చెప్పారు. ఆరోజు రాత్రి ఇంట్లో డబ్బు, నగలు తీసుకొని వెళ్ళిపోయారు..
Also Read: ఈ అమ్మాయి రీల్స్ పిచ్చి పీక్స్ కు వెళ్ళింది.. నడిరోడ్డు మీద ఏందీ చెండాలం
మరుసటి రోజు చూడగా ఇద్దరు ఇంట్లో లేకపోవడంతో ఆ కూతురు ఆందోళనకు గురైంది. ఇద్దరి ఫోన్లకి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు ఆమె అందించిన వివరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. వాస్తవానికి 55 ఏళ్ల మహిళకు భర్తతో విభేదాలు ఉన్నట్టు తెలుస్తోంది. పైగా ఆస్తిపరురాలు. ఆమెకు కొన్ని వ్యాపారాలు కూడా ఉన్నట్టు సమాచారం. కూతురి భర్తతో ఇలాంటి వ్యవహారం కొనసాగించడం పట్ల చుట్టుపక్కల వారు ఆ మహిళపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వావి వరసలు లేకుండా ఇలాంటి పనిచేయడం ఏంటని మండిపడుతున్నారు. కూతురి భర్తలో కొడుకును చూసుకోవాల్సిన ఆమె ఇంతటి నీచానికి దిగడం అత్యంత దారుణమని పేర్కొంటున్నారు. అయితే త్వరలోనే వారిద్దరిని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. మొత్తానికి ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.