Balayya : నేడు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ప్రముఖులకు పద్మ అవార్డ్స్ పురస్కారం దక్కింది. మన టాలీవుడ్ నుండి నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఈ అవార్డు ని అందుకున్నాడు. అక్కడికి వచ్చిన ప్రతీ ఒక్కరు మంచి సూటు, బూటుతో స్టైలిష్ గా వస్తే, బాలకృష్ణ మాత్రం తెలుగుదనం అడుగడుగునా ఉట్టిపడేలా పంచెకట్టు తో తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నాడు. అక్కడికి వచ్చిన ప్రముఖులందరిలో బాలయ్య బాబు ఎంతో ప్రత్యేకంగా కనిపించాడు. తెలుగువాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా నిల్చిన స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి కుమారుడు ఇలా కాకుండా ఇంకెలా ఉంటాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ బాలయ్య పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆనాడు ఎన్టీఆర్ కి పద్మ పురస్కారం వచ్చినప్పుడు కూడా ఆయన ఇలాంటి వేషధారణతోనే పురస్కారాన్ని అందుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు బాలయ్య కూడా అలాగే కనిపించడంతో అన్నగారిని చూసినట్టే ఉందని సోషల్ మీడియా లో నందమూరి అభిమానులు మురిసిపోతున్నారు.
Also Read : బాలయ్య ఫ్యాన్స్ కి పండగే..’డాకు మహారాజ్’ ఓటీటీ వెర్షన్ లో 15 నిమిషాల సరికొత్త సన్నివేశాలు!
బాలయ్య తో పాటు భార్య వసుందర , అల్లుళ్ళు నారా లోకేష్, భరత్, సోదరి భువనేశ్వరి, కూతుర్లు తేజస్విని, బ్రహ్మణీ, కొడుకు మోక్షజ్ఞ తేజ, మనవడు దేవాన్ష్ కూడా బాలయ్య తో పాటు మధురమైన క్షణాలను పంచుకున్నాడు. అందుకు సంబంధించిన గ్రూప్ ఫోటో సోషల్ మీడియా లో విడుదల చేయగా, అది బాగా వైరల్ అయ్యింది. బాలయ్య కి ఎప్పుడో ఈ అవార్డు రావాల్సిందని, చాలా ఆలస్యంగా వచ్చింది అంటూ సోషల్ మీడియా లో నందమూరి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఆయన పోషించిన పాత్రలు, చేసిన జానర్స్ గడిచిన రెండు జెనెరేషన్స్ లో ఏ హీరో కూడా చేయలేదని, కొన్ని పాత్రలు మన భారత దేశంలో బాలయ్య తప్ప ఎవ్వరూ చెయ్యలేరని, అలాంటి ఘన కీర్తి కేవలం ఆయనకు మాత్రమే సొంతమని అంటున్నారు.
ఇదంతా పక్కన పెడితే కేవలం సినీ నటుడిగా మాత్రమే కాదు, ఒక వ్యక్తిగా బాలయ్య సమాజానికి చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ని స్థాపించి, ఎన్నో వేలమందికి ఉచితంగా వైద్యం అందించాడని, అంతే కాకుండా హిందూపురం నుండి మూడు సార్లు ఎమ్మెల్యే గా గెలిచి, ఎన్నో సేవ కార్యక్రమాలు తలపెట్టాడని ఆయన అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇలాంటి ఉన్నతమైన వ్యక్తి పద్మభూషణ్ అందుకుంటే, ఆ పురస్కారానికే ఒక అలంకారం అని అభిమానులు పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు. సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసిన బాలయ్య మేనియా నే కనిపిస్తుంది.