Padma Bhushan : నేడు ఢిల్లీ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi), హోమ్ మినిస్టర్ అమిత్ షా(Amith Sha) మరియు ఇతర అతిరథ మహారథుల సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ అవార్డ్స్ ని అందించారు. మన తెలుగు సినీ పరిశ్రమ నుండి నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) అందుకున్నాడు. అదే విధంగా తమిళ సినీ పరిశ్రమ నుండి సూపర్ స్టార్ అజిత్(Thala Ajith) కూడా పురస్కారం ని అందుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా అభిమానులు సోషల్ మీడియా ద్వారా అజిత్ కి, నందమూరి బాలకృష్ణ కి శుభాకాంక్షల వెల్లువ కురిపిస్తున్నారు. ట్విట్టర్ లో ఈ ఇద్దరి హీరోల పేరిట లక్షల సంఖ్యలో ట్వీట్స్ పడుతున్నాయి. సరైన వ్యక్తులకు సరైన పురస్కారం అందినందుకు సంతోషం గా ఉందంటూ ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు.
సినీ నటుడిగా కళామ్మ తల్లికి నందమూరి బాలకృష్ణ అందించిన సేవలు అంతా ఇంత కాదు. ఆయన పోషించలేని పాత్ర అంటూ ఏది లేదు. 6 పదుల వయస్సు దాటినా, ఇప్పటికీ కుర్ర హీరోలతో సమానంగా సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతూ ముందుకు దూసుకొని పోతున్నాడు. ఇక నిజ జీవితం లో ఆయన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ని స్థాపించి ఎన్నో వేలమందికి ఉచితంగా వైద్యం అందించాడు. అదే విధంగా హిందూపురం శాసనసభ్యుడిగా ఎన్నో అద్భుతమైన సేవలను అందించి, రాజకీయాల్లో కూడా గొప్పగా రాణించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే బాలయ్య సాధించిన విజయాలు ఎన్నో ఉంటాయి. ఆయన చేసిన సేవలకు ఎప్పుడో పద్మభూషణ్ అవార్డు రావాల్సిందని, చాలా ఆలస్యంగా వచ్చింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించినందుకు సంతోషం అని, భవిష్యత్తులో ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు కూడా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
#BREAKING: Superstar Ajith receives the Padma Bhushan, the third highest civilian award in India pic.twitter.com/oBSRRZM1Wj
— Akshita Nandagopal (@Akshita_N) April 28, 2025
ఇక అజిత్ విషయానికి వస్తే, ఒక సాధారణ కుర్రాడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అజిత్, అతి తక్కువ సమయంలోనే నటుడిగా మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు. రజినీకాంత్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు జనాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న రోజుల్లోనే, అజిత్ ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ చేసి వాళ్ళతో సరిసమానమైన ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు తమిళనాడు లో మిగిలి ఉన్న ముగ్గురు సూపర్ స్టార్స్ లో ఒకరు అజిత్. ఎంజీఆర్, రజినీకాంత్ తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఏకైక హీరో అజిత్ మాత్రమే. నటుడిగా మాత్రమే కాదు, ఈయన కార్ రేసింగ్ లో మన ఇండియా కి బ్రాన్జ్ మెడల్ ని కూడా తెచ్చి పెట్టాడు. అంతే కాకుండా ప్రతీ ఏడాది ఏరోనాటికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి ఉచితంగా క్లాస్ లు తీసుకునే వాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అలాంటి సూపర్ స్టార్ కి పద్మ భూషణ్ అవార్డు రావడం పై సర్వత్రా శుభాకాంక్షల వెల్లువని కురిపిస్తున్నారు నెటిజెన్స్.