Balayya New Ad Mansion House : ఒకప్పటి బాలయ్య బాబు(Nandamuri Balakrishna) కి, అఖండ తర్వాత బాలయ్య బాబు కి ఎంత తేడా ఉందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. నేటి తరం యూత్ ఆడియన్స్ మైండ్ సెట్ కి తగ్గట్టుగా తనని తానూ మార్చుకోవడం లో బాలయ్య బాబు సక్సెస్ అయ్యాడు. అంతకు ముందు బాలయ్య కేవలం సినిమాలకు,రాజకీయాలకు మాత్రమే పరిమితం. కానీ ఇప్పుడు టాక్ షో కి హోస్ట్ గా కూడా వ్యవహరించే రేంజ్ కి వచ్చేసాడు. ఒకప్పుడు కమర్షియల్ యాడ్స్ కి బాలయ్య బాబు దూరంగా ఉండేవాడు. కానీ ఇప్పుడు ఆయన కమర్షియల్ యాడ్స్ కూడా చేసేస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే మ్యాన్షన్ హౌస్(Mansion House) అనే పేరు కేవలం బాలయ్య బాబు వల్లే ప్రాచుర్యం లోకి వచ్చింది. మందుకొట్టే ప్రతీ ఒక్కరికి ఈ బ్రాండ్ తెలియకుండా ఉండదు అనుకోండి, కానీ మందు కొట్టని వాళ్లకు కూడా తెలిసే రేంజ్ కి వెళ్లిందంటే అది బాలయ్య కారణంగానే.
ఆయన కారణంగా ఆ బ్రాండ్ అంతటి ప్రాచుర్యం చెందింది కాబట్టి మ్యాన్షన్ హౌస్ సంస్థ తమ ప్రొడక్ట్స్ కి బాలయ్య బాబు ని బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకుంది. అయితే మద్యాన్ని తాగమని ప్రోత్సహించడం తప్పు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ బాలయ్య బాబు ప్రమోట్ చేస్తున్నది మద్యాన్ని కాదు, ఈ బ్రాండ్ నుండి వస్తున్న మంచు నీళ్లు అన్నమాట. దీనికి సంబంధించిన చిన్న ప్రోమో ని రెండు రోజుల క్రితమే విడుదల చేశారు. ఇప్పుడు పూర్తి స్థాయి ప్రోమో ని విడుదల చేశారు. ఈ ప్రోమో లో బాలయ్య బాబు లుక్స్, ఆయన ఎనర్జీ ని చూసి అభిమానులు షాక్ కి గురయ్యారు. ఇలాంటి గెటప్ లో బాలయ్య బాబు ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు, చేస్తే బాగుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నందమూరి అభిమానులు.
Also Read : ‘గద’ కోసం బాలయ్య, బోయపాటి మధ్య మనస్పర్థలు..విషయం ఎంత దూరం వెళ్లిందంటే!
సింహం మీద స్వారీ చేస్తూ వేటగాడి మీదకు దూసుకు వచ్చిన బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ చెప్తాడేమో అని అనుకుంటే, వెరైటీ గా సింపుల్ డైలాగ్ తో సరిపెట్టాడు. ఆయన మాట్లాడుతూ ‘అన్నిటిని లవ్ చెయ్..లయన్ హార్ట్ తో వెల్కమ్ చెయ్..జిందగీ లో ఏదైనా దీనిని ఓపెన్ చెయ్..లైఫ్ ని వెల్కమ్ చెయ్’ అంటూ బాలయ్య మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ‘అఖండ 2’ లో నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ముందుగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25 న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అదే తేదీన పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం విడుదల కాబోతుండడం తో ‘అఖండ 2’ ని సంక్రాంతికి వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు.
#NBK For Mansion House!pic.twitter.com/nbxTl0uXci
— Gulte (@GulteOfficial) May 30, 2025