Homeఎంటర్టైన్మెంట్Balakrishna Mokshagna Debut: బాలయ్య చేయలేని సినిమాతో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నాడుగా...జానర్ ఏంటంటే...

Balakrishna Mokshagna Debut: బాలయ్య చేయలేని సినిమాతో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నాడుగా…జానర్ ఏంటంటే…

Balakrishna Mokshagna Debut: నందమూరి నటసింహం బాలయ్య బాబు క్రేజ్ తారా స్థాయిలో ఉంది. ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. అలాంటి బాలకృష్ణ ఈ మధ్యకాలంలో పూర్తిగా కమర్షియల్ సినిమాల వైపే అడుగులు వేస్తున్నాడు. ఆ మూవీస్ చేస్తేనే సేఫ్ జోన్ లో ఉండొచ్చనే ఉద్దేశ్యంతో బాలయ్య ఆలోచిస్తున్నారట. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ కమర్షియల్ గా సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ఉండడం విశేషం…బోయపాటి డైరెక్షన్లో చేసిన ‘అఖండ 2’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో మరోసారి కమర్షియల్ సినిమాలనే చేయాలనే ఆలోచనలో బాలయ్య ఉన్నట్టుగా తెలుస్తుంది.

తన కొడుకైన మోక్షజ్ఞ సైతం సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు అంటూ కొద్ది రోజుల నుంచి కొన్ని వార్తలైతే విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ క్రమంలో ఆయన ఎలాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడనే విషయంలో కూడా కొంతవరకు ఆసక్తి నెలకొంటుంది. ఇక ఇలాంటి క్రమంలోనే మోక్షజ్ఞ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

అందులోనే మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా జోడిస్తారట. మొత్తానికైతే ఇప్పటి వరకు బాలయ్య చేయనటువంటి ఒక డిఫరెంట్ ని తను పోషించబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలైతే వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం మీద బాలయ్య గాని, మోక్షజ్ఞ గాని స్పందిస్తే తప్ప ఈ సినిమా వస్తుందా? లేదా అనే విషయం మీద సరైన క్లారిటి రాదు…

ఇక బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక కమర్షియల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తన ఎంటైర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ ను సాధిస్తానని బాలయ్య చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు… నిజంగానే ఈ మూవీ సూపర్ హిట్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version