https://oktelugu.com/

Teja Sajja: బాలయ్య మహేష్ బాబు ప్రభాస్ రికార్డ్ లను బ్రేక్ చేసిన తేజ సజ్జా.. బుడ్డోడు మామూలోడు కాదు…

దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా రికార్డులను బ్రేక్ చేయడమే కాకుండా స్టార్ హీరోల రికార్డులను సైతం బ్రేక్ చేస్తూ వచ్చింది.

Written By:
  • Gopi
  • , Updated On : May 10, 2024 / 11:39 AM IST

    Teja Sajja

    Follow us on

    Teja Sajja: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చిన్న సినిమా గా వచ్చిన హనుమాన్ మూవీ పాన్ ఇండియాలో సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన విషయం మనకు తెలిసిందే. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా రికార్డులను బ్రేక్ చేయడమే కాకుండా స్టార్ హీరోల రికార్డులను సైతం బ్రేక్ చేస్తూ వచ్చింది.

    ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 350 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ఇప్పటివరకు స్టార్హీరోలకు కూడా సాధ్యం కానీ ఈ రికార్డ్ ను ఒక యంగ్ హీరో ఆయన తేజ సజ్జ అందుకోవడం అనేది అతని భవిష్యత్తు కు చాలా ఉపయోగకరంగా మారనుంది.ఇక నిజానికి తేజ ఈ సినిమాతో స్టార్ హీరో గా కూడా మారిపోయాడు. ఇక ప్రస్తుతం ఆయన ‘మిరాయ్ ‘ అనే సినిమాలో నటిస్తున్నాడు.

    ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు హనుమాన్ సినిమా మరొక అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. అది ఏంటి అంటే టిఆర్పి రేటింగ్ లో 10.26 రేటింగ్ ని సంపాదించుకొని సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. ఇక ఇంతకుముందు బాలయ్య బాబు హీరోగా వచ్చిన భగవంత్ కేసరి సినిమా 9.86 టిఆర్పిని సొంతం చేసుకోగా, మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం సినిమా 9.23 రైటింగ్ ని సంపాదించుకుంది. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా థియేటర్లో సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది.

    కానీ టెలివిజన్ లో మాత్రం ప్లాప్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాకు టిఆర్పి రేటింగ్ 6.5 మాత్రమే వచ్చింది. ఇక ఇదిలా ఉంటే యంగ్ హీరో అయిన తేజ బాలయ్య బాబు, మహేష్ బాబు, ప్రభాస్ లాంటి ముగ్గురు స్టార్ హీరోల రికార్డ్ లను బ్రేక్ చేస్తూ ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేయడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి…