Unstoppable: నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా వస్తోందంటే చాలు థియేటర్లలో సందడి వాతావరణం నెలకొంటుంది. అభిమానుల ఆనందాలకు హద్దే ఉండదు. అలాంటి బాలయ్య ఆహా ఓటీటీ వేదికగా అన్‌స్టాపబుల్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ.. తనలోని మరో ప్రతిభను బయటపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే షోకు సంబంధించిన రెండు ఎపిసోడ్లు విడుదలై ప్రేక్షకులను అలరించాయి. తొలి ఎపిసోడ్లో మంచు మోహన్‌బాబు గెస్ట్‌గా రాగా.. రెండో ఎపిసోడ్లో నేచురల్ స్టార్ నాని వచ్చి అలరించారు.
Balayya imitating ANR garu is the best thing you will find on internet today 🤘❤️#UnstoppableWithNBK Ep 3 Streaming now.
– https://t.co/C10ym0WDNE#NandamuriBalakrishna #Brahmanandam @AnilRavipudi pic.twitter.com/xZVnJBGzWD
— ahavideoin (@ahavideoIN) December 5, 2021
తాజాగా ఈ షోలో మూడో ఎపిసోడ్ కోసం హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, దర్శకుడు అనిల్ రావిపుడిని ఆహ్వానించారు. ఇటీవలే ఇందుకు సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ షో ఆహాలో ప్రసారమవుతోంది. సరదాగా సాగన ఈ ఎపిసోడ్లో బాలయ్య ఏఎన్ఆర్ను ఇమిటేట్ చేసిన వీడియోను ఆహా ప్రత్యేకంగా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. బ్రహ్మానందం కోరిక మేరకు బాలయ్య నాగేశ్వరరావును అనుకరించి డైలాగులు చెప్పారు.
కాగా, బాలయ్య హరోగా వచ్చిన అఖండ సినిమా ప్రస్తుతం బ్లాక్బాస్ట్ హిట్‌ను కొట్టింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు సొంతం చేసుకుంది. రోజుతో సంబంధం లేకుండా.. ఇప్పటికీ థియేటర్లు హౌస్‌ఫుల్ అవుతున్నారు. దీంతో బోయపాటి- బాలయ్య కాంబోలో ఇది హ్యాట్రిక్ చిత్రమైంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన సింహా, లెజెండ్ బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్‌గా నిలిచాయి. కాగా, ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ హైలైట్‌గా నిలిచింది. ఇందులో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించగా.. శ్రీకాంత్, జగపతిబాబు కీలకపాత్రల్లో నటించారు.