Balayya : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికి దక్కనటువంటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న హీరో బాలయ్య బాబు (Balayya Babu)…ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. వరుసగా నాలుగు విజయాలను సాధించి తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. అందుకే ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది.
Also Read : కథ ఎన్టీఆర్ కి నచ్చింది, బాలయ్యకు నచ్చలేదు… కట్ చేస్తే రిజల్ట్ చూసి అందరూ షాక్!
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో ల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇస్తు వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికీ నందమూరి ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చారు. ఇప్పుడు హరికృష్ణ మనుమడు జానకి రామ్ కొడుకు అయిన చిన్న ఎన్టీఆర్ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇస్తున్నాడు…ఇక బాలయ్య బాబు (Balayya Babu) లాంటి నటుడు సైతం తన కొడుకు అయిన మోక్షజ్ఞ(Mokshagna) ని ఇండస్ట్రీకి తీసుకురావాలని ఐదు సంవత్సరాల నుంచి అనుకుంటున్నప్పటికి ఆయన నుంచి ఇప్పటివరకు ఒక్క సినిమా అయితే రాలేదు.ఆయన కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అనుకుంటున్నాడా? లేదంటే ప్రేక్షకుల ఆనందం మేరకు సినిమా ఉంటుంది ఉంటుందని ఆశ పెడుతున్నాడా? నిజానికి ఆయన ఎంట్రీ ఉందా లేదా అనే ధోరణిలో ఆలోచిస్తున్న ప్రేక్షకులకు సైతం విసుగస్తుంది. నిజానికి నందమూరి ఫ్యామిలీ నుంచి జానకిరామ్ కొడుకు చిన్న ఎన్టీఆర్ పరిచయం అవ్వబోతున్న నేపథ్యంలో ఇంకా కూడా మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయమనే చెప్పాలి. అసలు లోపం ఎక్కడ జరుగుతుంది? మోక్షజ్ఞ కి సినిమా చేయాలనే ఇంట్రెస్ట్ ఉందా? లేదా ఒకవేళ అతనికి ఇంట్రెస్ట్ ఉన్నప్పటికి దర్శకులు అతన్ని ఇబ్బంది పెడుతున్నారా? అలాంటప్పుడు ఆ దర్శకులను పక్కనపెట్టి మరొక దర్శకుడి తో సినిమా చేస్తే బాగుంటుంది. మొత్తానికైతే సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగినప్పుడే ఆయా హీరోలకు చాలా మంచి క్రేజ్ అయితే దక్కుతోంది.
Also Read : బాలయ్య రెండు సార్లు థియేటర్ లో చూసిన జూనియర్ ఎన్టీఆర్ సినిమా అదేనా..? ఇన్ని రోజులు తెలియలేదుగా!
మరి ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మోక్షజ్ఞ తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలంటే మాత్రం అన్ని రకాలుగా సినిమా ఇండస్ట్రీలో తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. మరి ఎప్పటికప్పుడు ఈ సినిమా క్యాన్సిల్ అవుతూ రావడంతో బాలయ్య బాబు అభిమానులు సైతం తీవ్రమైన నిరాశను వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి మోక్షజ్ఞకు యాక్టింగ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేనట్టుంది. అందుకే ఆయనను ఫోర్సు చేసి సినిమాల్లోకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు. మరి అలా చేస్తే ఆయన సక్సెస్ ని సాధిస్తాడా ఇప్పుడున్న పోటీ ప్రపంచలో సాటి హీరోలతో పోటి పడగలుగుతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇప్పటివరకు ప్రశాంత్ వర్మ (Prashanth Varma) తో సినిమా ఉంటుంది అని చెప్పినప్పటికి ఆ మూవీ సెట్స్ మీదకి అయితే వెళ్ళలేదు. దాదాపు సంవత్సరం క్రితమే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ని కూడా అనౌన్స్ చేశారు. అయినా కూడా ఇప్పటివరకు ఎలాంటి మూమెంట్ అయితే కనిపించలేదు. ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో మంచి విజయాన్ని అందుకొని తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నా మోక్షజ్ఞ తండ్రికి తగ్గ తనయుడిగా ఎదుగుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది.