Balakrishna Funny Video: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఏమి చేసిన సోషల్ మీడియా మొత్తం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది. కొంతమంది ఆయన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు కానీ, ఆయనది కల్ముషం లేని మనస్సు అని అందరూ అంటుంటారు. సినిమాల్లో ఎంత గంభీరంగా కనిపిస్తాడో, బయట అంత చిన్నపిల్లాడిగా కనిపిస్తాడు బాలయ్య. అందుకే ఆయన్ని అభిమానులు ప్రాణాలు ఇచ్చే రేంజ్ లో అభిమానిస్తూ ఉంటారు. నేడు ఆయన అమరావతి లోని బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చాడు. హైదరాబాద్ లో బసవతారకం హాస్పిటల్ ద్వారా ఎన్నో వేల మందికి బాలయ్య బాబు ఉచితంగా వైద్యం అందించి వాళ్ళ ప్రాణాలను కాపాడిన దేవుడి లాగా నిల్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సేవలు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అందనున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరికరాలతో, ఎంతో అనుభవజ్ఞులైన డాక్టర్లు ఈ హాస్పిటల్ లో పని చేయబోతున్నారు.
Also Read: ప్యారడైజ్ సినిమాలో నాని చనిపోతాడా..? ఇదెక్కడి ట్విస్ట్ రా మావా..?
అయితే శంకుస్థాపన కార్యక్రమం జరిగిన తర్వాత బాలయ్య స్టైల్ గా మైక్ ని గాల్లోకి తిప్పి పట్టుకోవడం హైలైట్ గా మారింది. ముందుగా ఆయన మైక్ అందుకొని ‘అందరికీ నమస్కారం’ అని అంటాడు. ఆ తర్వాత ‘ఇలా అంటే కానీ’ అంటూ మైక్ ని గాల్లోకి తిప్పి పట్టుకోవాలని చూస్తాడు, కానీ మైక్ పడిపోతుంది. అప్పుడు పక్కనే ఉన్నవాళ్ళని చూస్తూ ‘పడిపోలేదు..అది ఎందుకు పడుతుంది..ఇదిగో ఈయన అడ్డం వచ్చాడు’ అని అంటాడు. ఆ తర్వాత మైక్ ని మళ్ళీ గాల్లోకి తిప్పి పట్టుకుంటాడు. ఈ వీడియో చూసేందుకు చాలా సరదాగా అనిపించింది. సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ వీడియో నే కనిపిస్తుంది. దీనిని చూసి అభిమానులు బాలయ్య మనస్సు వెన్న, కల్ముషం లేని వ్యక్తి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత బాలయ్య బాబు క్లీన్ షేవ్ లుక్ లో కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ లుక్ లో ఆయన చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు.
Also Read: ‘ఓజీ’ లో హీరోయిన్ చనిపోతుందా..? ఎవరికీ తెలియని షాకింగ్ విషయాలు లీక్ అయ్యాయీగా!
ఇకపోతే ఆయన రీసెంట్ గానే బోయపాటి శ్రీను తో ‘అఖండ 2’ చిత్రాన్ని పూర్తి చేసాడు. బాలయ్య కెరీర్ ని మలుపు తిప్పిన ‘అఖండ’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ కావడంతో ఈ సినిమా పై అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. స్టార్ హీరో పాన్ ఇండియన్ చిత్రానికి ఎలాంటి క్రేజ్ ఉంటుందో, ఈ సినిమాకు కూడా అలాంటి క్రేజ్ ఉంది. డబ్బింగ్ కార్యక్రమాలను కూడా బాలయ్య బాబు రీసెంట్ గానే పూర్తి చేసాడు. ఈ ఏడాది దసరా కానుకగా సెప్టెంబర్ 25 నా ఈ చిత్రాన్ని విడుదల చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారు,కానీ ఆ తేదీన రావడం కష్టమే అని, డిసెంబర్ నెలకు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. విషయం ఏమిటి అనేది మరికొద్ది రోజుల్లోనే తెలుస్తుంది.
Balayya Babu – Such A Pure Soul#NandamuriBalakrishna pic.twitter.com/i5GSbK28Mg
— cinee worldd (@Cinee_Worldd) August 13, 2025