ప్చ్.. బాలయ్య యాక్షన్ అమ్ముడుపోవడం లేదు !

నటసింహం బాలయ్య బాబు – సింహం బొమ్మ పెట్టుకుని యాక్షన్ చెప్పే బోయపాటి శ్రీను కలిసి ‘అఖండ’ అంటూ మరో రోటీన్ యాక్షన్ కొట్టుడు సినిమాని ప్రేక్షకుల ముందు పడేయడానికి కసరత్తులు చేస్తున్నారు. పైగా, చిన్న టీజర్ తో ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. ఎలాగూ బ్లాక్ బస్టర్ కాంబినేషన్, అందుకే అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఈ సినిమా పై ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే బాలయ్య – బోయపాటి కలిసి సింహా, లెజెండ్ లాంటి […]

Written By: admin, Updated On : June 1, 2021 2:56 pm
Follow us on

నటసింహం బాలయ్య బాబు – సింహం బొమ్మ పెట్టుకుని యాక్షన్ చెప్పే బోయపాటి శ్రీను కలిసి ‘అఖండ’ అంటూ మరో రోటీన్ యాక్షన్ కొట్టుడు సినిమాని ప్రేక్షకుల ముందు పడేయడానికి కసరత్తులు చేస్తున్నారు. పైగా, చిన్న టీజర్ తో ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. ఎలాగూ బ్లాక్ బస్టర్ కాంబినేషన్, అందుకే అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఈ సినిమా పై ఆసక్తి చూపిస్తున్నారు.

ఇప్పటికే బాలయ్య – బోయపాటి కలిసి సింహా, లెజెండ్ లాంటి బారీ హిట్స్ ఇవ్వడం, ఇప్పుడు ముచ్చటగా హ్యాట్రిక్ కోసం మరో ప్రయత్నం చేస్తుండటంతో, ఈ సినిమా మార్కెట్లో హాట్ కేక్ అన్నట్టే అని అనుకున్నారు. కానీ గ్రౌండ్ లెవల్స్ రిపోర్ట్ వేరేలా ఉంది. ఈ సినిమాకు సంబంధించి శాటిలైట్ డీల్ గురించి ఒక అప్ డేట్ తెలిసింది. సహజంగా స్టార్ హీరోల సినిమాలకు పెద్దగా బేరాలు ఉండవు.

మేకర్స్ అడిగి దానికి అటుఇటుగా టీవీ ప్లాట్ ఫామ్స్ కొనేస్తాయి. పైగా సెట్స్ పైకి వెళ్లకముందే శాటిలైట్ డీల్స్ క్లోజ్ అవుతాయి. మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా శాటిలైట్ రైట్స్ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే డీల్ క్లోజ్ అయింది. అయితే బాలయ్య బాబు అఖండ పరిస్థితి మాత్రం విభిన్నంగా ఉంది. బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అయినా, సినిమాకి మంచి క్రేజ్ ఉన్నా డీల్ మాత్రం క్లోజ్ అవ్వడం లేదు.

ఒక్క షెడ్యూల్ తప్ప మిగితా సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయినప్పటికీ.. బాలయ్య మూవీ పై టీవీ ప్లాట్ ఫామ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. జీ తెలుగు ఆసక్తి చూపిస్తోన్నా చాల తక్కువకి అడుగుతుందట. బాలయ్య-బోయపాటి హ్యాట్రిక్ మూవీ కావడంతో కాస్త ఎక్కువ మొత్తానికి అమ్మడానికి నిర్మాత చూస్తున్నాడు. కానీ గతంలో బాలయ్య సినిమాల పరిస్థితుల నేపథ్యంలో అంత మొత్తం కేటాయించడానికి ఛానెళ్లు ఆసక్తి చూపించడం లేదు.