Balakrishna Chennakesava Reddy: నందమూరి బాలకృష్ణ మరియు వీవీ వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన చెన్నకేశవ రెడ్డి చిత్రం అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజి గ్రాసర్ గా నిలిచినా సంగతి మన అందరికి తెలిసిందే..కథ మరియు కథనం బాగున్నప్పటికీ కూడా స్క్రీన్ ప్లే లో చిన్న చిన్న లోపాలు ఉండడం వల్ల ఈ సినిమా అప్పట్లో ఆశించిన స్థాయి లో విడుదల కాలేదు..కానీ అభిమానులకు చెన్నకేశవ రెడ్డి ఎంతో ప్రత్యేకమైన సినిమా..సెప్టెంబర్ 25 వ తారీకు 2002 వ సంవత్సరం లో విడుదలైన ఈ సినిమాకి దాదాపుగా 17 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..అయితే ఈ నెల 25 తారీఖున ఈ సినిమా వచ్చిన సరిగ్గా 20 ఏళ్ళు పూర్తి చేసుకోవడం తో ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో స్పెషల్ షోస్ ని నిర్వహించబోతున్నారు నందమూరి ఫాన్స్..దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి కూడా అయిపోయాయి..ఈ ఏడాది లో పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు పుట్టిన రోజులను పురస్కరించుకొని అభిమానులు ప్లాన్ చేసిన జల్సా మరియు పోకిరి స్పెషల్ షోస్ కి ఎలాంటి అపూర్వమైన రెస్పాన్స్ వచ్చిందో మన అందరికి తెలిసిందే.

పోకిరి సినిమా స్పెషల్ షోస్ కి ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలుపుకొని కోటి 75 లక్షల రూపాయిలు గ్రాస్ రాగా..పవన్ కళ్యాణ్ జల్సా మూవీ స్పెషల్ షోస్ కి 3 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి..ఓవర్సీస్ లో అయితే జల్సా సినిమా పెను సంచలనమే సృష్టించింది..ఈ సినిమా స్పెషల్ షోస్ కి దాదాపుగా 3 వేల టికెట్స్ అమ్ముడుపోగా 35 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి..ఇప్పుడు చెన్నకేశవ రెడ్డి స్పెషల్ షోస్ తో ఈ రికార్డు ని బద్దలు కొట్టడానికి చూస్తున్నారు నందమూరి ఫాన్స్..అమెరికా లో బాలయ్య బాబు కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా స్ట్రాంగ్ అనే విషయం మన అందరికి తెలిసిందే.

ఆయన గత ఏడాది లో హీరో గా నటించిన అఖండ సినిమాకి ఇక్కడ అద్భుతమైన నంబర్లు వచ్చాయి..ఇప్పుడు చెన్నకేశవ రెడ్డి సినిమాకి 25 వ తారీఖున 35 స్పెషల్ షోస్ ని ప్లాన్ చేశారట అభిమానులు..జల్సా సినిమాకి 27 షోస్ మాత్రమే పడ్డాయి..ఆ విధంగా షోస్ కౌంట్ పరంగా జల్సా రికార్డు ని దాటేసిన బాలయ్య బాబు..కలెక్షన్స్ పరంగా కూడా జల్సా రికార్డు ని కొడతాడా లేదా అనేది చూడాలి.