Balayya beat Chiranjeevi: 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి… ఆయనలాంటి హీరో తెలుగు సినిమా ఇండస్ట్రిలో మరొకరు లేరనేది వాస్తవం…తన డ్యాన్స్, ఫైట్స్, నటనతో ప్రేక్షకులందరిని మెప్పించిన ఆయన ఇప్పటివరకు నెంబర్ వన్ పొజిషన్ ని కైవసం చేసుకొని ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… ఇక సెకండిన్నింగ్స్ లో సైతం తన సత్తా చాటుతూ ముందుకు సాగుతున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఈ సంక్రాంతికి భారీ విజయాన్ని కైవసం చేసుకున్నాడు. ఎప్పటికప్పుడు తన పంథా ను మారుస్తూ సూపర్ హిట్ సినిమాలను చేసే ప్రయత్నం చేస్తూ వచ్చాడు. కానీ చిరంజీవి మాత్రం ఎప్పటికప్పుడు బాలయ్య బాబు డామినేట్ చేస్తూనే వచ్చాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఒకానొక సమయంలో చిరంజీవిని డామినేట్ చేసే అవకాశం బాలయ్య బాబుకు వచ్చింది. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి వరుస బ్లాక్ బస్టర్ సక్సెస్ లతో ఇండస్ట్రీ హిట్లను అందించిన బాలయ్య బాబు ఆ సమయంలో చిరంజీవిని డామినేట్ చేశాడు. అప్పుడు వరుసగా చిరంజీవి మృగరాజు, డాడీ లాంటి సినిమాలతో డీలా పడిపోయాడు…
మొత్తానికైతే బాలయ్య బాబు తన లైఫ్ లో ఒక్కసారి చిరంజీవిని డామినేట్ చేసి నెంబర్ వన్ పొజిషన్ ని తను దక్కించుకోబోతున్నాడంటూ వార్తల్లో నిలిచాడు. కానీ అది ఎక్కువ కాలం నిలువలేదు. ఆ తర్వాత చిరంజీవి మరోసారి ఇంద్ర సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేశాడు.
దాంతో బాలయ్య డీలా పడిపోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఇక అప్పటి నుంచి వరుసగా భారీ డిజాస్టర్ సినిమాలు రావడం ఒక పది సంవత్సరాలపాటు సక్సెస్ ఫుల్ సినిమాలు లేకపోవడంతో చిరంజీవితో పోటీపడే రేంజ్ లో బాలయ్య ఉండలేకపోయాడు. ఇక ఆ తర్వాత చిరంజీవి సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి వచ్చాడు.
ఆ తర్వాత రాజకీయాలు ఆయనకి కలిసి రాకపోవడం తో మళ్లీ 2017లో ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ సాధించాడు…అక్కడ కూడా బాలయ్య చేసిన ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమాతో పోటీ పడి బాలయ్య ను ఓడించి చిరంజీవి సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు…
