EU response to Trump tariffs: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడి రాజ్య విస్తరణ కాంక్ష ఆదేశానికి పెను సవాల్‌గా మారబోతోందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. వెనెజెవెలా అధ్యక్షుడిని ఆ దేశంలో చొరబడి పట్టుకొచ్చామని అహంకారంలో ఉన్న డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు గ్రీన్‌లాండ్‌ను ఎలాగైనా స్వాధీనం చేసుకుంటామని విర్రవీగుతున్నాడు. అడ్డువచ్చే దేశాలను టారిఫ్‌ల పేరుతో బెదిరిస్తున్నాడు. ఇప్పటికే 8 నాటో దేశాలపై 10 శాతం అదనపు సుంకాలు విధిస్తామని ప్రకటించారు. ఈ చర్య యూరోపియన్ యూనియన్‌కు కోపం తెప్పించింది. ఈయూ చారిత్రక ’ట్రేడ్ బజూకా’ ఆయుధాన్ని ఉపయోగించాలని ఆలోచిస్తోంది. ఇది అంతర్జాతీయ వాణిజ్య యుద్ధానికి దారితీయవచ్చు.
గ్రీన్‌లాండ్ వివాదం..
ట్రంప్ గ్రీన్‌లాండ్‌ను అమెరికాకు కొనుగోలు చేయాలని ప్రతిపాదించడం డెన్మార్క్, ఇతర యూరోపియన్ దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకిస్తున్నాయి. దీనికి ప్రతిస్పందనగా ఆయన ఆ దేశాల ఉత్పత్తులపై టారిఫ్‌లు విధించాలని సూచించాడు. ఇది వాణిజ్య నిబంధనలను ఉల్లంఘించే సంకేతంగా చూడబడుతోంది.
ఈయూ ప్రతీకారం..
రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఈయూ 93 బిలియన్ యూరోల (సుమారు 9.8 లక్షల కోట్ల రూపాయలు) విలువైన ప్రతీకార సుంకాలు విధించాలని పరిశీలిస్తోంది. ఇది చరిత్రలో మొదటిసారి ’ట్రేడ్ బజూకా’ వ్యూహాన్ని అమలు చేయడం. ఈ చర్య అమెరికన్ ఎగుమతులపై ధరలు పెంచి, రెచ్చగొట్టేలా ఉంటుంది.
ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం
ఈ ఉద్రిక్తత యూరోప్–అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలను దెబ్బతీస్తుంది. భారత్, ఆసియా దేశాలు కూడా పరోక్షంగా ప్రభావితమవుతాయి, ఎందుకంటే అంతర్జాతీయ సరఫరా చైన్‌లు భంగం కావచ్చు. డబ్ల్యూటీవో నియమాలు ఈ వివాదాన్ని పరిష్కరించాల్సి ఉంటుంది.
ట్రంప్ మళ్లీ అధికారంలోకి వస్తే ఈ టారిఫ్ యుద్ధం తీవ్రతరం కావచ్చు. ఈయూపై డొనాల్డ్ ట్రంప్ విధానాలకు మరింత గట్టిగా స్పందించే అవకాశం ఉంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కొత్త అస్థిరతలకు దారితీసే ప్రమాదం ఉంది.
