Balayya Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ‘విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు’ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన స్టామినాను చూపిస్తూ చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగాడు. ఇక అలాంటి నటుడు ఆ తర్వాత కాలంలో సీఎంగా మారి తెలుగు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలావరకు కృషి చేశాడు. ఇక ఆయన వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న బాలయ్య బాబు (Balayya Babu) లాంటి నటుడు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ఇండస్ట్రీలో భారీ విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఆయన వరుసగా నాలుగు విజయాలను సాధించి సీనియర్ హీరోలు ఎవరికి సాధ్యం కానీ ఒక అరుదైన రికార్డును కూడా క్రియేట్ చేశాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న అఖండ 2 (Akhanda 2 ) సినిమా కూడా భారీ విజయాన్ని సాధిస్తుందని తను చాలా కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నాడు. మరి ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇక మీదట సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.
Also Read : బాలయ్య ఫ్యాన్స్ కి పండగే..’డాకు మహారాజ్’ ఓటీటీ వెర్షన్ లో 15 నిమిషాల సరికొత్త సన్నివేశాలు!
ఇలాంటి సందర్భంలో బాలయ్య ఈ ఏజ్ లో సైతం ఆడిపాడుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం విశేషము… ఇక బాలయ్య బాబు చేయబోయే ఒక సినిమాకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రొడ్యూసర్ గా వ్యవహరించబోతున్నాడనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. బాలయ్య – రామ్ చరణ్ మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధాలైతే ఉన్నాయి.
అన్ స్టాపబుల్ (Unstopable) షో లో వీళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ అయితే మనకు చాలా క్లియర్ కట్ గా తెలిసిపోయింది. కాబట్టి బాలయ్య బాబు సినిమాకి రామ్ చరణ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించి ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. అటు నందమూరి, మెగా అభిమానులు అందరూ కూడా ఆ సినిమా మీద ఆసక్తి చూపిస్తూ థియేటర్లకు వచ్చి సినిమాను చూసి సూపర్ సక్సెస్ చేస్తారనే ఉద్దేశ్యంతోనే ఇలాంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారట. మరి ఈ సినిమాకి దర్శకుడు ఎవరు అనే విషయం మీద సరైన క్లారిటీ అయితే ఇవ్వడం లేదు. కానీ మొత్తానికైతే వీళ్ళ కాంబినేషన్లో ఒక సినిమా ఉంటుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది.