
Pawan Kalyan, NBK – Unstoppable With NBK S2 PROMO : పవన్ కళ్యాణ్ పాల్గొన్న మొట్టమొదటి టాక్ షో ‘అన్ స్టాపబుల్ విత్ NBK’..ఇటీవలే విడుదల చేసిన మొదటి భాగం కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.ఈ ఎపిసోడ్ కోసం ఆహా మీడియా వాళ్ళు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.మొదటి భాగం కి ఇప్పటి వరకు స్ట్రీమింగ్ అయిన సెలబ్రిటీస్ అందరి కంటే అత్యథిక వ్యూస్ వచ్చినట్టు ఆహా మీడియా అధికారికంగా ప్రకటించింది.
రెండవ భాగం ఈ నెల 10 వ తారీఖున ప్రసారం చెయ్యబోతున్నట్టు ఇప్పటికే ప్రకటన చెయ్యగా దానికి సంబంధించిన ప్రోమో ని కాసేపటి క్రితమే విడుదల చేసారు.ఈ ప్రోమో లో బాలయ్య పవన్ కళ్యాణ్ ని చాలా ఘాటైన ప్రశ్నలు అడిగాడు, ఇంత ఘాటు ప్రశ్నలు ఎదుగుతాడని ఎవ్వరూ ఊహించలేకపోయారు..పవన్ కళ్యాణ్ కూడా అందుకు ధీటైన సమాదానాలు ఇచ్చాడు, ఆ ప్రోమో లో కొన్ని హైలైట్ పాయింట్స్ ని ఇప్పుడు మేము మీ ముందు ఉంచబోతున్నాము.
పవన్ కళ్యాణ్ ఇటీవలే ఉత్తరాంధ్ర లో పర్యటించినప్పుడు వైసీపీ పార్టీ ప్రవర్తించిన తీరుపై బాలయ్య బాబు ప్రశ్నలు అడుగుతాడు..దానికి పవన్ కళ్యాణ్ చెప్పిన సమాధానం ని మ్యూట్ లో పెట్టారు సస్పెన్స్ కోసం , ఇక ఆ తర్వాత బాలయ్య బాబు మాట్లాడుతూ ‘నువ్వు పూర్తిగా సినిమాలు మానేసి రాజకీయాలు చెయ్యాలనేది నా అభిప్రాయం..ఇక్కడకి వచ్చిన ఆడియన్స్ అభిప్రాయం కూడా తీసుకుందాం’ అని అంటాడు, అప్పుడు ఆడియన్స్ అందరూ బాలయ్య చెప్పిన మాటని సమర్థిస్తూ అవునని చెప్తారు.దీనికి పవన్ కళ్యాణ్ షాక్ కి గురి అవుతాడు, ఆయన సమాధానం ని ఇచ్చిన ఒక పేపర్ మీద రాస్తాడు..ఏమి రాసాడు అనేది తెలియాలంటే 10 వ తేదీ వరకు ఆగాల్సిందే.
https://www.youtube.com/watch?v=P2uqvb8EAZI