Balakrishna’s Younger Brother: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నందమూరి కుటుంబం కి ఎలాంటి ప్రత్యేక స్థానం ఉందొ మన అందరికి తెలిసిందే..స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి నట వారసులుగా ఇండస్ట్రీలోకి ఎంత మంది వచ్చినప్పటికీ..ప్రేక్షకుల అశేష ప్రజాదరణ పొడిని మాత్రం కేవలం నందమూరి బాలకృష్ణ మరియు జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే..మధ్యలో కళ్యాణ్ రామ్ మరియు తారక రత్న వంటి వారు వచ్చినప్పటికీ ఈ ఇద్దరి స్థాయిలో ఇండస్ట్రీ లో నిలదొక్కుకోలేకపోయారు..ఇది ఇలా ఉండగా నందమూరి కుటుంబం నుండి బాలకృష్ణ తర్వాత 1988 వ సంవత్సరం లో ఒక హీరో వచ్చాడనే విషయం ఈ తరం వారికి చాలా మందికి తెలియదు..ఆయన మరెవరో కాదు..NTR గారి సోదరుడు నందమూరి త్రివిక్రమరావు గారి కుమారుడు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి..త్రివిక్రమ రావు గారి వేడితెర మీద నటించకపోయినప్పటికీ కూడా ఎన్టీఆర్ తో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించాడు..అలా ఆయన కొడుకుగా కళ్యాణ్ చక్రవర్తి 1988 వ సంవత్సరం లో కోడి రామ కృష్ణ గారి దర్శకత్వం లో తెరకెక్కిన ‘అత్తగారు స్వాగతం’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరో గా పరిచయం అయ్యాడు..ఈయన మన నందమూరి బాలకృష్ణ గారికి స్వయానా తమ్ముడి వరుస అవుతాడు.
Also Read: Anchor Vishnupriya: ఆ విషయంలో చెడ్డదాన్ని.. యాంకర్ విష్ణుప్రియ పోస్ట్ వైరల్
నందమూరి కుటుంబం నుండి వస్తున్న హీరో కావడం తో తొలి సినిమా భారీ అంచనాల నడుమే విడుదలైంది..కానీ ఆ అంచనాలను అందుకోవడం లో ఈ సినిమా ఘోరంగా విఫలం అయ్యింది..ఇక ఆ తర్వాత ఈయన కోడళ్ల సవాల్, ఇంటి దొంగ మరియు ప్రేమ కిరీటం వంటి సినిమాలలో హీరోగా నటించాడు..కానీ ఒక్క సినిమా కూడా ఆశించిన స్థాయి ఫలితం దక్కించుకోలేదు..ఆ సమయం లో మెగాస్టార్ చిరంజీవి 100 వ సినిమా లంకేశ్వరుడు లో కళ్యాణ్ చక్రవర్తి కి చిరంజీవి గారి చెల్లెలు భర్త గా నటించే అవకాశం దక్కింది..దాసరి నారాయణ రావు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది..కానీ నటుడిగా కళ్యాణ్ చక్రవర్తి కి మాత్రం మంచి గుర్తింపుని తెచ్చి పెట్టింది..ఇక ఆ తర్వాత మన తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం చెన్నై నుండి హైదరాబాద్ కి తరలి వెళ్తున్న సమయం లో కళ్యాణ్ చక్రవర్తి గారి తండ్రి త్రివిక్రమరావు గారికి అస్వస్థత ఏర్పడింది..తండ్రికి అన్నీ దగ్గర ఉందిమరి చూసుకోవాల్సిన పరిస్థితి రావడం తో కళ్యాణ్ చక్రవర్తి చెన్నై లోనే ఉండిపోయారు..ఇక కొన్ని రోజుల తర్వాత తండ్రి చనిపోవడం తో కళ్యాణ్ చక్రవర్తి మానసికంగా కృంగిపోయాడు..అలా ఆయన సినిమాలకు పూర్తిగా దూరమయ్యాడు..ఇక ఆ తర్వాత ఆయన కుటుంబం నుండి ఎవరిని కూడా సినిమా ఇండస్ట్రీ లోకి రానివ్వలేదు..ప్రస్తుతం ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి ఉంది.
Also Read: Top 10 Livable Cities : ప్రపంచంలోనే టాప్- 10 నివాసయోగ్య నగరాలేవో తెలుసా?