Mokshagna Film Debut: నందమూరి నటసింహంగా తనకంటూ మంచి ఐడెంటిటి ని సంపాదించుకున్న హీరో బాలయ్య బాబు సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి పునికి పుచ్చుకున్న నటవారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన భారీ సినిమాలను చేయడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరిని మెప్పించడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు… ఇప్పటికే వరుసగా నాలుగు విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఆయన ఇకమీదట రాబోయే సినిమాలతో కూడా వరుస విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకోగలిగే కెపాసిటీ బాలయ్య బాబుకి ఉందా అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వెలువడుతున్నాయి. నిజానికి బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ‘అఖండ 2’ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమాతో ఇండియాలోనే బాలయ్య బాబు టాప్ హీరోగా మారిపోతాడు అంటూ బోయపాటి చాలా కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తూ బాలయ్య అభిమానులకు భరోసా ఇస్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే బాలయ్య బాబు సైతం ఈ సినిమా విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నారట. ఇప్పటికే షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా ఉంది. సెప్టెంబర్ 25వ తేదీన ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు…
Also Read: విశ్వంభర గ్లింప్స్ లో ఏముంది..? దీని కోసం ఇంతలా వెయిట్ చేయాలా..?
ఇక ఇదిలా ఉంటే బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తాడు అంటూ గత కొన్ని సంవత్సరాలుగా వార్తలైతే వస్తున్నాయి.గత సంవత్సరం మోక్షజ్ఞ బర్త్ డే రోజున ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ మొదటి సినిమా ఉంటుందని బాలయ్య బాబు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. అయినప్పటికీ అది ఇప్పటివరకు కార్యరూపం అయితే దాల్చలేదు…
ఇక మరో దర్శకుడితో మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పించాలనే ఉద్దేశంతో బాలయ్య బాబు ఉన్నట్టుగా తెలుస్తోంది… ఇక ఇదిలా ఉంటే బాలయ్య బాబు చేసిన సినిమాలు అన్నీ ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చాయి. కానీ మోక్షజ్ఞ కి మాత్రం ఒక సినిమా అంటే నచ్చదట. ఇప్పటివరకు ఆ సినిమాని ఎప్పుడు చూసినా కూడా మోక్షజ్ఞ కి భారీగా ఇరిటేషన్ వస్తుందట.
Also Read: పూర్తిగా తమిళ సినిమాలాగా మార్చేసిన అట్లీ..అల్లు అర్జున్ పొరపాటు చేశాడా?
ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే బాలయ్య బాబు చేసిన ‘విజయేంద్ర వర్మ’ సినిమా కావడం విశేషం…. ఆ సినిమాలో బాలయ్య బాబు చేసిన స్టంట్స్ చాలా సిల్లీగా ఉంటాయని అసలు ఏమాత్రం లాజిక్స్ లేకుండా ఉండటం వల్ల బాలయ్య బాబుని చాలా రోజులపాటు ట్రోల్ చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే మోక్షజ్ఞ కి కూడా ఆ సినిమా అంటే అసలు నచ్చదట. బాలయ్య బాబు అందులో నటించకపోయి ఉంటే బాగుండేదని ఆయన పలు సందర్భాల్లో తమ సన్నిహితుల దగ్గర తెలియజేసినట్టుగా అప్పట్లో కొన్ని వార్తలైతే బయటికి వచ్చాయి…