Nandamuri Family Rift: నందమూరి ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయి అనే విషయం ఎప్పటికప్పుడు ప్రస్పుటంగా ప్రేక్షకులకు తెలిసిపోతోంది. ఎందుకంటే ఒకరి ఈవెంట్స్ కి మరొకరు హాజరు కాకపోవడం, ఒకరి సక్సెస్ లో ఇంకొకరు భాగం కాకపోవడం ఇవి చూస్తుంటే నందమూరి ఫ్యామిలీలో భారీగా చీలీకలు అయితే వచ్చినట్టుగా తెలుస్తున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్ ఇద్దరు ఒక వైపు ఉంటే నందమూరి ఫ్యామిలీతో పాటు నారా ఫ్యామిలీ సైతం ఒక వైపు ఉన్నట్టుగా తెలుస్తోంది…ఇక ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ మీద నందమూరి ఫ్యామిలీ అటు నారా ఫ్యామిలీ కొంతవరకు విముఖతను వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్ కి ముందు జైల్లో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దానిమీద ఎలాంటి స్పందనను తెలియజేయలేదు. చాలామంది ప్రముఖులు సైతం చంద్రబాబు నాయుడు ను కలవడానికి వచ్చారు. అలాగే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ద్వారా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం దానికి భిన్నంగా వ్యవహరించాడు. అప్పటి నుంచే వీళ్ళ ఫ్యామిలీల మధ్య గొడవలైతే వచ్చినట్టుగా తెలుస్తున్నాయి.
Also Read: బాలయ్య బాబు చేసిన సినిమాల్లో మోక్షజ్ఞ కి ఆ మూవీ అంటే అస్సలు నచ్చదట… కారణం ఏంటంటే..?
ఇక రీసెంట్ గా నారా రోహిత్ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నప్పుడు కూలీ సినిమా నచ్చిందా? వార్ 2 సినిమా బాగుందా అని అడిగితే కూలీ బావుంది.. వార్ 2 నేనింకా చూడలేదు అని చెప్పాడు. కారణం ఏంటి అంటే జూనియర్ ఎన్టీఆర్ కి వాళ్ళకి మధ్య సన్నిహిత సంబంధాలు లేకపోవడం వల్ల అతని గురించి పాజిటివ్ గా మాట్లాడడానికి కూడా వాళ్ళు ఒప్పుకోవడం లేదు.
దానివల్లే వార్ 2 సినిమా చూడలేదని అతను చెప్పడం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది…రోజురోజుకీ వీళ్ళ మధ్యలో ఉన్న గొడవలు తారా స్థాయికి వెళ్లిపోతున్నాయి. ఇక వీళ్ళు ఎప్పుడూ కలుస్తారు, ఎప్పుడూ అందరు కలిసి ఒకే వేదిక మీద కనిపిస్తారు అంటూ నందమూరి అభిమానులతో పాటు తెలుగుదేశం కార్యకర్తలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: బర్త్ డే స్పెషల్.. పవన్ కు సర్ప్రైజ్ చేసిన చిరు!
చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చి ఈ గొడవలకు పులిస్టాప్ పెట్టగలిగితే బాగుంటుందంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం… చూడాలి మరి వీళ్ళ మధ్య ఉన్న గొడవ ఎప్పుడు సద్దుమణుగుతోంది. వీళ్ళందరు కలిసి ఒక సినిమా ఎప్పుడు చేస్తారు అనేది…