Balakrishna Daughter Tejaswini: నిప్పు లేకుండా పొగ రాదు. పొగ వచ్చినంత మాత్రాన అది అట్టించే నిప్పు అనే అనుకోలేం. అసలు, టాలీవుడ్ లో నిప్పు వున్నా లేకున్నా పొగ రావడం అనేది చాలా కామన్ పాయింట్. అందుకే, ఎన్ని ఘాటు రూమర్లు వచ్చినా పెద్ద ఆశ్చర్యం కలగదు. ఐతే, సినిమా ఇన్ సైడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న గ్యాసిప్ ఏమిటంటే బాలయ్య బాబు వ్యవహారాలన్నీ ఆయన చిన్న కుమార్తె తేజస్విని చూసుకుంటున్నారని. ఇన్నాళ్లు అన్‌స్టాపబుల్ కు మాత్రమే ఆమె పరిమితం అనుకున్నారు.

కానీ, తేజస్విని ఇప్పుడు బాలయ్య సినిమా వ్యవహారాలు కూడా చూసుకుంటున్నారు. నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా బాలయ్య సినిమాల క్వాలిటీ వ్యవహారాలు అన్నీ ఆమె స్వయంగా చూసుకోవడంతో, ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. సహజంగా బాలయ్యతో సినిమా చేస్తే.. పెద్దగా డిమాండ్స్ ఉండవు. కానీ.. ఇప్పుడు అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది పరిస్థితి.
Also Read: Ambati Rambabu: అనంత బాబును డైవర్ట్ చేయడానికే జూ ఎన్టీఆర్ పేరు ఎత్తాడు !
సినిమా క్వాలిటీ విషయంలో ఆమె ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. బాలయ్య కాస్ట్యూమ్స్ విషయంలో కూడా తేజస్విని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిజానికి తేజస్వినికి పెద్దగా సినిమాలు చేసిన అనుభవం లేదు. కానీ, ఎంతో సక్సెస్ చూసిన వ్యక్తిలా ఆమె అంచనా ఉందట. ఆడియన్స్ పల్స్ ఏమిటన్నది ఆమెకు పక్కాగా తెలుసు అంటున్నారు. చూడటానికి చాలా సింపుల్ గా కనిపించే ఆమెలో, మంచి విజన్ ఉన్న నిర్మాత కూడా ఉన్నారని టాక్ నడుస్తోంది.

పైగా తేజస్విని చుట్టూ అనుభవజ్ఞులు వున్నారు. వారి సలహా సంప్రదింపులు కూడా ఆమె సదా తీసుకుంటూ వుంటారు. అందుకే ఇప్పుడు బాలయ్యతో చేస్తున్న సినిమాల దర్శకుల పనితీరు విషయంలో ఆమె పక్కాగా ఉంటున్నారు. ప్రతి షాట్ బాగుండాలి అనేది ఆమె లెక్క. ప్రస్తుతం బాలయ్యతో సినిమా చేస్తున్న ఓ డైరక్టర్ కు ఆమె గట్టి క్లాస్ కూడా పీకారట.
అదన్నావ్..ఇదన్నావ్.. చేస్తున్నదేమిటి అని ఆమె ఆ డైరక్టర్ పై సీరియస్ అయ్యారు. యాక్షన్ సినిమా అయినంత మాత్రాన, లాజిక్స్ లేకపోతే ఎలా ? ప్రతి సీన్ కి లాజిక్ ఉండాలి అనేది తేజస్విని డిమాండ్. మొత్తానికి తేజస్విని దెబ్బకు బాలయ్య డైరెక్టర్లు భయపడుతున్నారు. ఐతే, తేజస్విని వల్ల బాలయ్య సినిమాల క్వాలిటీ గణనీయంగా పెరగడం విశేషం.
Also Read:NTR-Sai Pallavi: ఒకే ఫ్రేమ్ లో ఎన్టీఆర్ కి పోటీగా సాయిపల్లవి డ్యాన్స్ చేస్తే.. ?