అయితే ప్రస్తుతం కరోనా రెండో వేవ్ కారణంగా సినిమాలన్నీ పోస్ట్ ఫోన్ అయ్యాయి. ఇప్పటికే తమ సినిమాలను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ కూడా అధికారికంగా ప్రకటించి.. కొత్త రిలీజ్ డేట్లు కోసం కసరత్తులు చేస్తున్నారు. కానీ ఇంకా బాలయ్య బాబు అఖండ టీం నుంచి మాత్రం, ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. మొదట ఈ సినిమాని మే 28న విడుదల చేస్తున్నామని పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో మే 28న సినిమా రిలీజ్ అయ్యే అవకాశమే లేదు. కాబట్టి, రేపోమాపో సినిమా పోస్ట్ ఫోన్ అయిందని ప్రకటన రావొచ్చు. అయితే, కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ పోస్టర్ ను వదిలితే బాగుంటుంది అని బాలయ్య టీమ్ ఫీల్ అవుతుంది. కాగా తాజా సమాచారం ప్రకారం ‘అఖండ’ చిత్రాన్ని ఆగస్టు ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
మరి ఆగష్టు ఫస్ట్ వీక్ అంటే అప్పటి లోగా కరోనా సెకెండ్ వేవ్ పూర్తిగా తగ్గాలి. మరి అప్పటి లోపు పరిస్థితులు అనుకూలిస్తాయో లేదో చూడాలి. ప్రస్తుతానికి అయితే ఇండస్ట్రీలో థియేటర్స్ పై ఆధిపత్యం చలాయిస్తున్న వారికి బాలయ్య టీమ్ నుండి అప్ డేట్ వెళ్ళింది. ‘అఖండ’ ఆగష్టు ఫస్ట్ వీక్ లో థియేటర్లోకి వచ్చేస్తుందని.. ముందే చెబుతున్నాం కాబట్టి థియేటర్స్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు బాలయ్య టీమ్. మరి థియేటర్స్ ఉన్న ఆ ముగ్గురు ఏమంటారో !