Akhanda Hindi Trailer: అఖండ బాలయ్య కెరీర్లో మెమరబుల్ హిట్. ఆ సినిమా పోతే బాలయ్య కెరీర్ క్లోజ్ అయ్యేది. అంతగా ఆయన మార్కెట్ పడిపోయింది. వరుస పరాజయాలతో బాలయ్య సినిమా అంటే జనాలకు ఆసక్తిపోయే పరిస్థితి ఏర్పడింది. 2019లో విడుదలైన బాలయ్య రూలర్ మూవీ వసూళ్లు అందుకు నిదర్శనం. రూలర్ వరల్డ్ వైడ్ షేర్ రూ. 7.5 కోట్లు. నైజాంలో ఈ చిత్రానికి రూ. 1.35 కోట్ల షేర్ వచ్చింది. ఒక స్టార్ హీరో సినిమాకు మొదటిరోజు రావాల్సిన కలెక్షన్స్ లో సగం కూడా లైఫ్ టైం రన్ లో రాలేదు. అంత దారుణంగా బాలయ్య మార్కెట్ కొలాప్స్ అయ్యింది. ఆ టైంలో అఖండ ఆయనకు ఊపిరిపోసింది.

దర్శకుడు బోయపాటి శ్రీను మరోసారి బాలయ్యను కాపాడాడు. అభిమానుల ఆశలు నిలబెట్టాడు. అఖండ మూవీతో అంచనాలు అందుకున్నాడు. కోవిడ్ సంక్షోభం తర్వాత థియేటర్స్ కి కళ తెచ్చిన చిత్రాల్లో అఖండ ఒకటి. అఖండ వరల్డ్ వైడ్ రూ. 120 కోట్ల గ్రాస్ రాబట్టింది. బాలకృష్ణ ఫస్ట్ వంద కోట్ల చిత్రంగా నిలిచింది. అఖండ చిత్రంతో థియేటర్స్ దద్దరిల్లాయి. 2021 డిసెంబర్ మొత్తం థియేటర్స్ లో అఖండ సందడి కనిపించింది.
కుర్ర హీరోలు కూడా హిందీలో సత్తా చాటుతున్న తరుణంలో బాలయ్య అఖండతో ఒక ట్రయిల్ వేయాలి అనుకుంటున్నాడు. జనవరి 20న అఖండ చిత్రం హిందీలో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో హిందీ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూసిన అభిమానులు ఉసూరుమన్నారు. కారణం…హిందీలో బాలయ్య సీరియస్ డైలాగ్స్ కూడా నవ్వు తెప్పిస్తున్నాయి. తెలుగు జనాలకు ట్రైలర్ అసలు కనెక్ట్ కాలేదు. కారణం… డబ్బింగ్ వాయిస్ బాలకృష్ణకు సెట్ కాలేదు.

బాలయ్య డైలాగ్స్ కి పెట్టింది పేరు. ఆయన వాయిస్ ప్రత్యేకంగా ఉంటుంది. సవాలు చేయాలన్నా, వార్నింగ్ ఇవ్వాలన్నా… బాలయ్యే. ఆయన కంచు కంఠం డైలాగ్ ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేస్తుంది. ఏళ్లుగా బాలయ్య వాయిస్ కి అలవాటు పడ్డ తెలుగు ఆడియన్స్ అఖండ ట్రైలర్ లో డబ్బింగ్ వాయిస్ విని అబ్బే… అనేశారు. పైగా ట్రైలర్ ఫన్నీగా ఉందంటూ తేల్చేశారు. బాలయ్య కోసం మరొక డబ్బింగ్ ఆర్టిస్ట్ ని ఎంచుకుంటే బాగుండు అనిపించింది. అసలు వేరే వాళ్లు డబ్బింగ్ చెప్పాల్సిన అవసరం ఏముంది? బాలయ్యకు హిందీ వచ్చు కదా… ఆయనే డబ్బింగ్ చెబితే బాగుండేది అంటున్నారు. అప్పట్లో నరేంద్ర మోడీకి వార్నింగ్ ఇచ్చిన హిందీ డైలాగ్స్ గుర్తు చేసుకుంటున్నారు.