Sankranti 2027 movies : సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల మధ్య పోటీ ఉంటుంది. వాళ్ళు చేసే సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించడానికి ఎవరికి వాళ్ళు డిఫరెంట్ స్ట్రాటజీ లను వాడుతూ ముందుకు సాగుతుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఒకప్పుడు చిరంజీవి,బాలయ్య, వెంకటేష్ ల మధ్య భీకరమైన పోటీ జరిగిందనే విషయం మనలో చాలామందికి తెలియదు. 2001 సంక్రాంతి కానుకగా ఈ ముగ్గురు హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఏ సినిమా విజయాన్ని సాధించింది? ఎవరు టాప్ హీరోగా నిలిచారనే అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…
చిరంజీవి హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన మృగరాజు సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. చిరంజీవి ఇమేజ్ కి తగ్గ కథ కాదని దీంట్లో సరైన విలనిజం లేదని సింహాన్ని విలన్ అని చెప్పడం వల్ల ప్రేక్షకులు ఈ సినిమా నుంచి డివియెటి అయిపోయారంటూ చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేశారు…
వెంకటేష్ హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవి పుత్రుడు సినిమా సైతం 2001 జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మీద మొదటి నుంచి భారీ హైప్ క్రియేట్ అయింది. దానికి కారణం ఏంటంటే అంతకు ముందు కోడి రామకృష్ణ చేసిన దేవి సినిమా సూపర్ సక్సెస్ అయింది. గ్రాఫిక్స్ ఓరియంటెడ్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మైమరపింపజేసింది. దాంతో దేవిపుత్రుడు సినిమా సైతం అలాగే ఉంటుందని ప్రతి ఒక్కరు భావించారు. కానీ ఈ సినిమా డిఫరెంట్ గా ఉండడంతో ప్రేక్షకులు ఈ సినిమాకి కనెక్ట్ కాలేకపోయారు…
బాలయ్య హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన నరసింహా నాయుడు సినిమా సైతం జనవరి 11వ తేదీన రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకి మొదట ఎలాంటి పెద్దగా హైప్ క్రియేట్ అవ్వకపోయిన కూడా మూవీ రిలీజ్ అయిన తర్వాత సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. నిజానికి బాలయ్య, చిరంజీవి, వెంకటేష్ ల మధ్య ఇలాంటి భారీ పోటీ వాతావరణం ఎప్పుడు నెలకొనలేదు. కారణం ఏంటంటే ఈ మూడు సినిమాలు కూడా భారీ హైప్ తో వచ్చినవే కావడం వల్ల ఇందులో ఎవరు విజయాన్ని సాధిస్తారు అనేది ప్రతి ఒక్కరు క్యూరియాసిటిని రేకెత్తించింది. మొత్తానికైతే బాలయ్య చిరంజీవిని అలాగే వెంకటేష్ ను డామినేట్ చేస్తూ ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకోవడం అనేది నిజంగా ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసిందనే చెప్పాలి…