నందమూరి బాలకృష్ణ తాజాగా డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నాడు. వీరిద్దరి కాంబినోషన్లలో గతంలో ‘లెజెండ్’, ‘సింహా’ వంటి బ్లాక్ బస్టర్ మూవీలు తెరకెక్కాయి. తాజాగా బోయపాటి తెరకెక్కిస్తున్న మూవీలో బాలయ్య డ్యూయల్ చేస్తున్నాడు. ఇందులో ఒక పాత్రలో అఘోర కనిపించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన సన్నివేశాలను వారణాసి చిత్రీకరించేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ మూవీలో చేస్తునే బాలయ్య మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
బాలయ్యతో దర్శకుడు బి.గోపాల్ గతంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను చేశారు. వీరిద్దరి కాంబోలో మరో క్రేజీ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ‘సమరసింహారెడ్డి, ‘నరసింహనాయుడు’ ‘రౌడీ ఇన్స్పెక్టర్’, ‘లారీ డ్రైవర్’ వంటి బ్లాక్ బస్టర్ మూవీలను బాలయ్యకు బి.గోపాల్ అందించాడు. ఈ మూవీ షూటింగ్ వేసవిలో ప్రారంభం కానుంది.
ఇటీవల బి.గోపాల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘పల్నాటి బ్రహ్మనాయుడు’ మూవీలో బాలయ్యతో ట్రైన్ వెనక్కు వెళ్లే సీన్ తో తనకు చాల చెడ్డ పేరు వచ్చిందని చెప్పాడు. తాజాగాఒక మంచి యాక్షన్ కథతోనే బాలయ్యను డైరెక్టర్ చేయనున్నాడు. బి.గోపాల్ తో బాలయ్య తన 107వ సినిమాను చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వీరిద్దరి హిట్ కాంబినేషన్ కావడంతో ఈ మూవీపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.