
‘‘నవ్వే వాళ్లూ నవ్వనీ.. తిట్టేవాళ్లూ తిట్టనీ.. డోన్ట్ కేర్’’ అంటూ.. తన పద్ధతిని చక్కగా పాట రూపంలో ఆ మధ్య వినిపించారు నందమూరి బాలకృష్ణ. అయితే.. తన బిహేవియర్ ను మాత్రమే పాటగా వినిపించడం కాదు.. నిజంగానే ఆయనకు పాటలు పాడడమంటే మహాఇష్టం.
ఆ మధ్య ఓసారి స్టేజీ మీద ‘లెజెండ్’ సినిమాలోని పాట పాడి అందరినీ అలరించారు. ఇక, ఈ మధ్య ‘‘శివశంకరీ.. భక్తవశంకరీ’’ అంటూ పాత పాటను తనదైన గాత్రంతో వీనుల విందు చేశారు. బాలకృష్ణ ఏం చేసినా ఫ్యాన్స్ కు నచ్చుతుంది. కానీ.. కొంత మంది మాత్రం ఇబ్బంది పడ్డారనే వార్తలు వచ్చాయి.
అయినప్పటికీ.. ఇవన్నీ పట్టించుకోలేదు బాలయ్య. మరోసారి తన గాత్రానికి పదును పెట్టారు. రేపు (మే 28) ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అందరినీ సర్ ప్రైజ్ చేయబోతున్నారు. సరిగ్గా ఉదయం 9 గంటల 45 నిమిషాలకు బాలయ్య గానాన్ని వినిపించబోతున్నారు.
అయితే.. ఈ సారి పాటలు కాకుండా శ్రీరామ దండకం వినిపించబోతున్నారు. నిన్నటి నుంచి సస్పెన్స్ అని చెప్పి ఊరించిన విషయం తెలిసిందే. అది శ్రీరామ దండకమేనని సమాచారం. మరి, ఇప్పటి వరకూ పాటలతో అందరినీ అలరించిన బాలకృష్ణ.. రేపు శ్రోతలను ఏ విధంగా ఆకట్టుకుంటారో చూడాలి.
#NandamuriBalakrishna sings the holy chant #SriRamaDandakam on the eve of #NTR‘s birth anniversary.
Watch out for it tomorrow at 9:45 AM.
Stay Tuned: https://t.co/oH4JpThnNn#NandamuriTarakaRamaRao @NBKFilms_ pic.twitter.com/icegs7PPLm— NBK FILMS (@NBKFilms_) May 27, 2021