Balakrishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ ఒక సెన్సేషన్. ఆయన సినిమాలో పంచ్ లు, డైలాగ్స్ తో ప్రేక్షకుల బ్లడ్ లో రైళ్లు పరుగెత్తిస్తారు. సినిమాల్లోనే కాకుండా రాజకీయంగా.. అటు ఓటీటీ వేదికగా నిర్వహించే ‘అన్ స్టాపబుల్’ హోస్ట్ గా ఈ సీనియర్ హీరో ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. ఇక తనకున్న కాస్త కొద్ది విరామ సమయంలో కొన్ని సినీ ఫంక్షన్లకు అటెండ్ అవుతున్నారు. లేటెస్టుగా ఈయన ‘ధమ్కీ’ మూవీ ప్రమోషన్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా బాలకృష్ణ డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో ఆశ్చర్యపరిచాడు. అంతేకాకుండా తన నోటి వెంట ‘F’ అని పదే పదే రావడంతో అందరూ షాక్ అయ్యారు.

విశ్వక్ సేన్ హీరోగా ‘ధమ్క’ మూవీ త్వరలో వెండి తెరపై రాబోతుంది. ఆయన స్వీయ డైరెక్షన్ లో చేసిన ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటించింది. వన్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్ సంయక్త బ్యానర్లో కరాటే రాజు ఈ సినిమాను నిర్మించారు. మ్యూజిక్ ను లియాన్ జేమ్స్ అందించారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఏఎంబీ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణ స్పెషల్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు.
సాధారణంగా బాలకృష్ణ డైలాగ్స్ సిల్వర్ స్క్రీన్ పై పేలుతున్నాయి. కానీ ‘ఆన్ స్టాపబుల్’ ప్రోగ్రాంలో హోస్ట్ గా చేసుకున్నప్పటి నుంచి ఆయన రియల్ గా కూడా హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఒక్కోసారి డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో ఫ్యాన్స్ కు షాక్ ఇస్తున్నారు. ‘ధమ్కీ’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లోనూ బాలయ్య పంచ్ డైలాగ్స్ తో ఆకట్టుకున్నారు. ముందుగా సరస్వతీ శ్లోకంతో మొదలుపెట్టిన ఆయన కామెంట్స్ ఆ డబుల్ మీనింగ్స్ వరకు వెళ్లాయి.

ఈ సందర్భంగా బాలకృష్ణ విశ్వక్ సేన్ ను ఉద్దేశించి మాట్లాడుతూ ‘అరె బయ్..మొత్తం నువ్వే మాట్లాడినవ్.. ఇక నేనేం మాట్లాడను’ అని మొదటి పంచ్ వేశారు. ఆ తరువాత స్పీచ్ కంటిన్యూ చేస్తూ ‘నీ ఇంట్లో నా ఇంజిన్’ అనే డైలాగ్ కొట్టారు. దీంతో ఆడిటోరియం మొత్తం అరుపులతో మారుమోగింది. ఆ తరరువాత ‘విశ్వక్ సేన్ నాన్న మాట్లాడుతూ థమ్కీలగా ఎత్తిండు.. తర్వాత మైకులు పనిచేయమో అనుకున్నా.. ఆయనకు విశ్వక్ సేన్ హీరో అవుతాడని ముందే తెలుసెమో.. నాలాగే ఉంగరాలు పెట్టుకున్నాడా ఏంటీ..’ అని అన్నారు. ఆ తరువాత కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ కొడుతూ బాలయ్య ఆసక్తిగా నిలాచారు.