ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు(Kota Srinivasarao) సంచలన నిజాలు వెల్లడించారు. తనకు బాలయ్యతో ఎదురైన అనుభవం గురించి చెప్పాడు. గతంలో ఎన్టీఆర్ హయాంలో మండలాదీశుడు అనే సినిమా చేశాడు కోట శ్రీనివాసరావు. అప్పట్లో అది ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా వచ్చిన సినిమా. అందులో ఎన్టీఆర్ పాత్ర కోట వేశారు. దీంతో అది బాలయ్యకు నచ్చలేదు. ఆ సినిమా విడుదలయ్యాక కోటను ఎక్కడ బయట కనిపించినా ఎన్టీఆర్ అభిమానులు టార్గెట్ చేసి కొట్టిన సందర్భాలు ఉన్నాయి.
దీంతో ఎన్టీఆర్ నే కలవాలని చాలాసార్లు ప్రయత్నించినా కుదరలేదు. కానీ ఓసారి మాత్రం బాలయ్యకు కోట ఎదురుపడ్డాడు. ఓ సినిమా షూటింగ్ కోసం రాజమండ్రి వచ్చిన్పుడు ఇద్దరు తారసపడడంతో కోట బాలయ్యకు నమస్కారం చెప్పారు. కానీ బాలయ్య మాత్రం కోట మొహంపై ఉమ్మేశాడు. దీంతో తనకు జరిగిన అవమానాన్ని బయటపెట్టాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కోట సంచలన విషయాలు వెల్లడించారు
ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రి అయిన కొత్తలో మండలాదీశుడు సినిమా వచ్చింది. రామారావు వేషం కోట వేయడంతో అది అప్పట్లో సంచలనం అయింది. బాలయ్య తన మొహం మీద ఉమ్మేయడమే కాదు ఇంకా అలాంటి అవమానాలు చాలా ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. అయినా ఎన్టీఆర్ మాత్రం సినిమా బాగుందని మెచ్చుకుని భుజం తట్టారని చెప్పాడు.