Balakrishna- Anil Ravipudi: నందమూరి బాలకృష్ణ మల్టీపుల్ టాలెంటెడ్ అని అందరికీ తెలుసు. ఓ వైపు ఎమ్మెల్యేగా ప్రజల్లో మెదులుతూనే.. మరోవైపు సినీ ఇండస్ట్రీలో బిజీగా మారుతున్నారు. అటు ఓటీటీ వేదికగా ‘అన్ స్టాపబుల్’ ప్రొగ్రాంతో ఆకట్టుకుంటున్నాడు. లేటేస్టుగా బాలయ్యకు సంబంధించిన ‘వీరసింహారెడ్డి’ మూవీ మేకింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇదే తరుణంలో ఈ సీనియర్ హీరో అనిల్ రావిపూడి డైరెక్షన్లో మరో సినిమాకు సైన్ చేశారు. ఆ సినిమా షూటింగ్ ఈ నవంబర్లో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ బాలకృష్ణ దానిపై అనిల్ కు ఓ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారట.

‘అఖండ’ మూవీ సక్సెస్ తరువాత బాలకృష్ణ జోష్ లో ఉన్నారు. వెంటనే గోపిచంద్ మలినేని డైరెక్షన్లో ఓ మాస్ మూవీ చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాకు ‘వీరసింహారెడ్డి’ అనే టైటిల్ ను ఇటీవలే ఖరారు చేశారు. సంక్రాంతి బరిలో సినిమా ఉంటుందని ప్రకటించారు కూడా. దీంతో నందమూరి ఫ్యాన్స్ సంక్రాంతి ఫెస్టివల్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో మరో బాలయ్య చేస్తున్న మరో మూవీపై అనిల్ రావిపూడికి షాక్ ఇచ్చారట.
‘వీరసింహారెడ్డి’ షూటింగ్ ప్రారంభంలోనే అనిల్ రావిపూడికి బాలయ్య ఓ మూవీ కోసం హామీ ఇచ్చాడు. దీనిని ఈ నవంబర్లో స్ట్రాట్ చేద్దామని అనుకున్నారు. అయితే ప్రస్తుతం ‘వీరసింహారెడ్డి’తో పాటు ‘అన్ స్టాపబుల్ 2’తో తీరిక లేకుండా గడుపుతున్నారు. దీంతో నవంబర్లో ప్రారంభం కావాల్సిన ఆ మూవీ కాస్తా వాయిదా వేశారు. ‘వీరసింహారెడ్డి’ పూర్తయిన తరువాత జనవరిలో ఈ సినిమా షూటింగ్ మొదలు పెడుతామని అన్నారట. అయితే అనిల్ రావిపూడి ఇప్పటికే హీరోయిన్ శ్రీలీల, ప్రియమణి డేట్లు తీసుకున్నారట. ఇప్పుడు బాలయ్య ఈ సినిమా వాయిదా వేయడంతో అవి వేస్ట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

బాలకృష్ణ 108వ చిత్రంగా వస్తున్న ఈ మూవీ సెంటిమెంట్ తో కూడుకున్నది. తండ్రీ, కూతుళ్ల మధ్య ఈ కథ సాగుతుందట. బాలకృష్ణ తో సినిమా తీయాలని అనిల్ రావిపూడి ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఆయన 100వ సినిమా తీయాలని దిల్ రాజు ఆయన చేతులో పెట్టాడట. అప్పుడే ఈ స్టోరీ చెప్పి దీనికి ‘రామారావు గారు’ అనే టైటిల్ ను కూడా పెట్టారట. కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. మొత్తానికి నవంబర్లో బాలయ్య అవకాశం ఇచ్చారు. కానీ ఇప్పుడు దానిని వాయిదా వేయమని కోరడంతో అనిల్ రావిపూడి షాక్ తిన్నారు.